Matka | టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తోన్న తాజా చిత్రం మట్కా (Matka). పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మట్కాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ అందించారు మేకర్స్. రీసెంట్గా రామోజీఫిలిం సిటీలో మట్కా ఫైనల్ షెడ్యూల్ కొనసాగుతుంది. ఎక్జయిటింగ్ అప్డేట్స్ వచ్చేస్తున్నాయి.. అంటూ మేకర్స్ ఓ వార్తను షేర్ చేశారు.
తాజాగా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. పేక ముక్కలు ఆటకు రెడీ చేస్తున్న లుక్ షేర్ చేస్తూ.. విడుదల తేదీని రేపు ఉదయం 11:05 గంటలకు లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక ఇప్పటికే విడుదల చేసిన మట్కా టైటిల్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కథానుగుణంగా నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. మట్కాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.
మట్కా ఆడియో రైట్స్ ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ రూ.3.6 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసిందని సమాచారం. ఈ సినిమా కోసం మేకర్స్ ఇప్పటికే 1980 బ్యాక్‌డ్రాప్ వైజాగ్ లొకేషన్స్ డిజైన్ చేయగా.. ఇందుకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ నెట్టింట రౌండప్ చేస్తోంది.
#MATKA Release Date Announcement Tomorrow at 11.05 AM ❤️🔥
Mega Prince @IamVarunTej pic.twitter.com/7lGFSOXs0c
— BA Raju’s Team (@baraju_SuperHit) September 30, 2024
Kamal Haasan | సల్మాన్ ఖాన్, అట్లీ సినిమాకు కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?
Kannappa | పిలక-గిలకగా సప్తగిరి, బ్రహ్మానందం.. మంచు విష్ణు కన్నప్ప నయా లుక్ వైరల్