Matka | పలాస 1978 ఫేం డైరెక్టర్ కరుణకుమార్ కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం మట్కా (Matka). పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ మూవీలో టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
మట్కా తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది వరుణ్ తేజ్ టీం. మీడియాతో చిట్ చాట్‌లో జీవీ ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ.. మట్కా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాశ్ కుమార్ అన్నాడు. మట్కా యాక్షన్, ఎమోషన్స్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ల కలయికతో సాగే ఇంటెన్స్ గ్యాంగ్ స్టర్ డ్రామా అని చెప్పాడు.
కరుణకుమార్ అద్భుతంగా తెరకెక్కించాడని, వరుణ్ తేజ్ కెరీర్లో ఉత్తమ నటనను చూస్తారన్నాడు. ఇప్పుడీ కామెంట్స్ మట్కా సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. మట్కా చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ ఘోష్, బొమ్మాళి రవిశంకర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Pushpa 2 Vs Chaava | పుష్పరాజ్ ఫీవర్.. అల్లు అర్జున్‌తో పోటీపై విక్కీ కౌశల్ వెనక్కి తగ్గాడా..?
Prithviraj Sukumaran | కరీనాకపూర్‌తో పృథ్విరాజ్ సుకుమారన్ రొమాన్స్..!
Thug Life | కమల్‌హాసన్ ‘థగ్ లైఫ్’ టీజర్ రిలీజ్