Varanasi | తెలుగు ప్రేక్షకులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ వారణాసి (Varanasi). ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు లీడ్ రోల్లో, బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమార్ కీ రోల్లో నటిస్తున్నాడు.
ఈ ముగ్గురూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలతో చిట్‌చాట్ చేశారని తెలిసిందే. ఓ ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత ప్రియాంకా చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్, మహేశ్ బాబు సెల్ఫీ దిగారు. ఇందులో ప్రియాంకా చోప్రా మందాకిని పాత్రలో కనిపించనుంది. మహేశ్ బాబు రుద్రగా కనిపించనుండగా.. పృథ్విరాజ్ సుకుమారన్ కుంభ రోల్లో నటిస్తున్నాడు. ప్రపంచమంతా చుట్టేయబోతున్న కథలోని ముఖాలు.. ముగ్గురి కలయికలో డిఫరెంట్ హిట్ ఉండబోతుందనే క్యాప్షన్‌తో మహేశ్ బాబు టీం పోస్ట్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో లాంచ్ చేసిన టైటిల్ గ్లింప్స్‌లో మహేశ్ బాబు త్రిశూలాన్ని చేతపట్టుకుని ఎద్దు (నంది)పై స్వారీ చేస్తున్న విజువల్స్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. ఈ మూవీని 2027, 2029లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా జక్కన్న టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
RUDHRA – MANDAKINI – KUMBHA
This trio hits different 🔥
#Varanasi@urstrulyMahesh @priyankachopra @PrithviOfficial pic.twitter.com/Xhsdv3ujDH
— Sri Durga Arts (@SriDurgaArts) November 18, 2025
BISON OTT | ఓటీటీలోకి ధృవ్ విక్రమ్ ‘బైసన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!