Ram Pothineni |టాలీవుడ్లో ఎనర్జిటిక్ స్టార్‌గా పేరొందిన రామ్ పోతినేని ప్రస్తుతం తన తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో కొత్త అంచనాలు రేకెత్తిస్తున్నాడు. నవంబర్ 27న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా రామ్ కెరీర్లో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ విజయానంతరం వేర్వేరు జానర్లలో ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్న రామ్, ఈసారి మాస్‌తో పాటు ఎమోషన్ కలిసిన కథతో రాబోతున్నాడు. సినిమా రిలీజ్ సమీపిస్తున్న నేపథ్యంలో రామ్ వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.
ముఖ్యంగా రామ్, హీరోయిన్ భాగ్యశ్రీ ప్రేమలో ఉన్నారని వార్తలు హల్చల్ చేశాయి. ఇద్దరూ ఒకే హోటల్లో కనిపించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఫోటోలతో రూమర్లకు మరింత బలం చేకూరింది. అంతేకాక, సినిమాలోని “నువ్వుంటే చాలు” పాటను రామ్ స్వయంగా రాయడం, ఆ పాట భాగ్యశ్రీ కోసమే రాశాడన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో రామ్ ఈ రూమర్లపై స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. మేమిద్దరం ప్రేమలో ఉన్నామన్న వార్తల్లో ఒక్క శాతం నిజం లేదు. నేను రాసిన సాంగ్ టైమ్‌కు హీరోయిన్ కూడా ఫైనల్ కాలేదు. కాబట్టి చూడని అమ్మాయి కోసం ఎలా పాట రాస్తాను? అని రామ్ ప్రశ్నించాడు.
అలాగే, ప్రస్తుతం ప్రేమపై ఎలాంటి ఇంట్రస్ట్ లేదు. ఎవరి మీదా ఆ ఫీలింగ్ కూడా లేదు అని చెప్పి ప్రేమ, పెళ్లి గాసిప్‌లకు పూర్తిగా చెక్ పెట్టేశారు. రామ్ క్లారిటీ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులు మాత్రం సరదాగా స్పందిస్తున్నారు. “వయసు పెరుగుతోంది రామ్… ఇంకెప్పుడు పెళ్లి?”, హీరోయిన్స్‌తో రూమర్ వచ్చినప్పుడల్లా ఎందుకు డినై చేస్తున్నావ్?” అంటూ జోకులు చేస్తున్నారు. కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్, ఈ చిత్రంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. ప్రమోషన్స్‌లో రామ్ చూపిస్తున్న ఎనర్జీ, సినిమా టీం క్రియేట్ చేస్తున్న బజ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది.