Bison Movie OTT | కోలీవుడ్ నటుడు చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘బైసన్’ (Bison). ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా.. గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్లో సూపర్ హిట్‌ను అందుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా ఒకేసారి అందుబాటులోకి రాబోతుంది. ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించగా. పశుపతి, రజిషా విజయన్, అమీర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
Kabaddi nammuluku vena oru game ah irukalam, aana Kittanukku adhaan life eh 🔥💪 pic.twitter.com/DeZoMlOG5l
— Netflix India South (@Netflix_INSouth) November 17, 2025