Music Has No Borders | ప్రముఖ పాకిస్తానీ రాపర్, సింగర్ తల్హా అంజుమ్ (Talha Anjum) చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేపాల్లో అతడి మ్యూజిక్ కన్సర్ట్ జరుగగా.. ఈ వేడుకలో ఆతడు భారత జాతీయ జెండా (త్రివర్ణ పతాకం)ను స్వీకరించి సగర్వంగా ప్రదర్శించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కన్సర్ట్ జరుగుతున్నప్పుడు ఒక అభిమాని తల్హా ముందుకు వచ్చి.. భారత జెండాను అతడికి ఇవ్వగా తల్హా దానిని తీసుకుని గర్వంగా ఊపాడు. అయితే దీనిపై కొందరూ విమర్శలు చేయగా.. సంగీతానికి హద్దులు లేవంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
ఈ ఘటనపై తల్హా అంజుమ్ తన పోస్ట్ రాసుకోస్తూ… నా హృదయంలో ద్వేషానికి స్థానం లేదు. అలాగే నా కళకు ఎలాంటి సరిహద్దులు లేవు. నేను భారత్ జెండా పట్టుకోవడం మీకు సమస్య అనిపిస్తే మళ్లీ అలాగే చేసి చూపిస్తాను. సంగీతం ద్వారా తాను ఇరు దేశాల అభిమానులను ఏకం చేయడానికే ప్రయత్నించాను. దీనిని అనవసరంగా రాజకీయం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Pakkstani rapper Talha Anjum wore Indian flag during his performance at a concert last night in Nepal..
What a beautiful gesture.. pic.twitter.com/q7xHe2zbxy— Eco Vibes 🌍 (@EcoVibeExplorer) November 16, 2025