కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్ పోషించిన స్ట్రెయిట్ తొలి తెలుగు చిత్రం సార్ (Sir). తమిళంలో వాథి (Vaathi) టైటిల్‌తో తెరకెక్కింది. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సార్ టీం నుంచి చిన్న కానుక అంటూ ఇప్పటికే అప్డేట్ ఇచ్చాడు వెంకీ అట్లూరి.
ఆ సర్ప్రైజ్ ఏంటో కాదు.. సార్ సూపర్ హిట్ సాంగ్ వావాథి ధనుష్ వెర్షన్ (VaaVaathi Dhanush Reprise Version)ను లాంఛ్ చేశారు మేకర్స్. ఒరిజినల్ వెర్షన్‌ను మించిపోయేలా ధనుష్ వాయిస్‌తో సాగుతున్న ఈ పాట నెట్టింట సెన్సేషన్ సృష్టించడం పక్కా అని తాజా అప్డేట్తో అర్థమవుతోంది.
సార్ చిత్రంలో సముద్రఖని, తనికెళ్లభరణి, సాయికుమార్, నర్రా శ్రీనివాస్, హైపర్ ఆది ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్‌చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. సార్ చిత్రంలో మలయాళ నటి సంయుక్తామీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది.
జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేసిన మాస్టారు.. మాస్టారు (తెలుగు వెర్షన్), వావాథి (తమిళంలో) అంటూ సాగే ఈ పాట విడుదలై రోజు నుంచి నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ పాట తమిళ వెర్షన్‌ను ధనుష్ స్వయంగా రాయగా.. తెలుగులో రామజోగయ్య శాస్త్రి రాశారు. రెండు భాషల్లో ఈ పాటను శ్వేతా మోహన్ పాడింది.
వావాథి సాంగ్ ధనుష్ వెర్షన్..
The melody that swept you off your feet, The lyrics that will steal your heart, Once again 😍#VaaVaathiDReprise is here! Written & Sung by our Poetu @dhanushkraja Sir! 💌
A @gvprakash Musical! 🎶#VenkyAtluri @iamsamyuktha_ @dopyuvraj @vamsi84
— Sithara Entertainments (@SitharaEnts) February 23, 2023
మాస్టారు.. మాస్టారు తెలుగు వెర్షన్..
వావాథి తమిళ వెర్షన్..
Read Also :
Venky Atluri | మా సార్ టీం నుంచి చిన్న కానుక.. వెంకీ అట్లూరి సర్ప్రైజ్ ఏంటో మరి..!
Phalana Abbayi Phalana Ammayi | ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి నుంచి కనుల చాటు మేఘమా రిలికల్ సాంగ్
Chiranjeevi | భారతీయ సినిమా గర్వించే క్షణం.. రాంచరణ్ షోపై చిరంజీవి ఎమోషనల్