టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) పాపులర్ అమెరికన్ టీవీ షో గుడ్ మార్నింగ్ అమెరికా (Good Morning America)లో సందడి చేసిన విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇప్పటివరకు ఎవరికీ రాని అరుదైన అవకాశం అందుకున్నాడు రాంచరణ్. టీవీ షోలో పాల్గొన్న సందర్భంగా న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ వీధుల్లో అభిమానులు, ఫాలోవర్లతో కలిసి సెల్ఫీలు, ఫొటోలు దిగాడు రాంచరణ్. ఈ ఫొటోలు ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారడమే కాదు.. వరల్డ్‌వైడ్‌గా అభిమానులను సంపాదించుకున్నాడు రాంచరణ్. తన కుమారుడికి తెలుగు సినీ పరిశ్రమ తరపున అత్యంత అరుదైన అవకాశం రావడంతో.. భావోద్వేగానికి లోనయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. తెలుగు, భారతీయ సినిమా గర్వించే క్షణం.. రాంచరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో కనిపించడం గొప్ప విషయం. ఒక ఉద్వేగభరితమైన ఆలోచన, శక్తి దార్శనికుడి (ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి)లో పుట్టిన తీరు అద్భుతం.. అంటూ తన ఎక్జయిట్‌మెంట్‌ను ట్వీట్ ద్వారా తెలియజేశాడు చిరంజీవి.
రాంచరణ్ మరోవైపు ఫిబ్రవరి 24న యూఎస్‌లో జరుగబోయే ఆరవ వార్షిక హెచ్‌సీఏ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్లో కూడా సందడి చేయబోతున్నాడు. ఈ స్టార్ హీరో ఈవెంట్లో వన్ ఆఫ్ ది ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నాడు. అమెరికన్ యాక్టర్లు బ్రండోన్ పెరెరా, డేవిడ్ డస్ట్మాల్చియాన్, మేడ్లిన్ క్లైన్, ట్రినిటీ జో-లీ బ్లిస్, వయోలెట్ ఎంసీగ్రాతో కలిసి పాపులర్ హెచ్‌సీఏ ఫిల్మ్ అవార్డ్సులో సందడి చేయబోతున్నాడు రాంచరణ్. ఆర్ఆర్ఆర్ హెచ్‌సీఏ ఫిల్మ్ అవార్డ్స్-2023 ఫైనల్ నామినేషన్స్ లో ఉత్తమ యాక్షన్ సినిమా, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో చోటు సంపాదించుకుంది.
గుడ్ మార్నింగ్ అమెరికా షోలో రాంచరణ్..
A Proud Moment for Telugu / Indian Cinema @AlwaysRamCharan ,features on the famed #GoodMorningAmerica
Amazing how the power of One passionate idea born in the visionary @ssrajamouli ‘s brain, envelopes the world!
Onwards & Upwards !! 👏👏https://t.co/Ur25tvt9r9 pic.twitter.com/SrpisRfviK
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 23, 2023
Man Of Masses @AlwaysRamCharan Click With @GMA Early in the Morning in NY ❤️#GlobalStarRamCharan Will be Interacting at @ABCGMA3 in Few more Mins !!#ManOfMassesRamCharan pic.twitter.com/WNY1Xjtldf
— CINEMA POSTS (@CinemaPosts) February 23, 2023
Love beyond boundaries ❤️❤️
The people's man 'Mega Powerstar' @AlwaysRamCharan was greeted by his fans just before appearing on @GMA from Times Square New York 🤩#RamCharan #ManOfMassesRamCharan #NaatuNaatuForOscars #RRR #Oscars2023 pic.twitter.com/C9STx09yyO
— BA Raju's Team (@baraju_SuperHit) February 23, 2023
Read Also :
Ugram teaser | అల్లరి నరేశ్ ఈజ్ బ్యాక్.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ఉగ్రం టీజర్
Dasara | నాని బర్త్ డే స్పెషల్.. సరికొత్తగా దసరా ప్రమోషన్స్ ప్లాన్
Prabhas | బ్యాక్ టు షూట్.. మారుతి సినిమాకు ప్రభాస్ నయా డేట్స్