MIW vs RCBW : డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) కష్టాల్లో పడింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన భారీ ఛేదనలో టాపార్డర్ వైఫల్యంతో 70లోపే సగం వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ. కీలక బ్యాటర్లు డగౌట్ చేరడంతో ఒత్తిడిలో కూరుకుపోయిన బెంగళూరును గెలుపు దిశగా నడిపిస్తోంది నడినే డీక్లెర్క్(32 నాటౌట్).
భారీ ఛేదనను దూకుడుగా ఆరంభించిన ఆర్సీబీకి షబ్నం ఇస్లాయిల్ షాకిచ్చింది. ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన(18)ను ఔట్ చేసి తొలి వికెట్ అందించింది. కాసేపటికే నాట్ సీవర్ బ్రంట్ ఓవర్లో పెద్ద షాట్ ఆడిన గ్రేస్ హ్యారిస్(25) బౌండరీ లైన్ వద్ద షబ్నం చేతికి చిక్కింది. దాంతో.. 45కే ఓపెనర్లు డగౌట్ చేరారు. ఆ తర్వాత 9 పరుగుల వ్యవధిలోనే ఆర్సీబీ బ్యాటర్లు రీచా ఘోష్(6), దయలాన్ హేమలత(7), రాధా యాదవ్(1) ఔటయ్యారు. 65కే ఐదు వికెట్లు పడిన దశలో క్రీజలోకి వచ్చిన నడినే డీక్కెర్క్(32 నాటౌట్) తన మార్క్ విధ్వంసానికి తెరతీసింది. సైకా ఇషాక్ వేసిన 14 వ ఓవర్లో చివరి రెండు బంతుల్ని బౌండరీకి పంపిన ఈ హిట్టర్.. నికోలా కారే ఓవర్లోనూ ఫోర్‌తో స్కోర్ 110 దాటించింది.
𝗗𝗼𝘂𝗯𝗹𝗲 𝗦𝘁𝗿𝗶𝗸𝗲! 🔥
2025 Purple Cap winner Amelia Kerr weaves her magic in her very first over 🪄
P.S. – Don’t miss Nicola Carey’s superb catch 🫴
Updates ▶️ https://t.co/IWU1URl1fr#TATAWPL | #KhelEmotionKa | #MIvRCB pic.twitter.com/u2yX6xcBOk
— Women’s Premier League (WPL) (@wplt20) January 9, 2026