స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతోపాటు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవికా మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే కొంతభాగం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. తాజాగా కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. మారుతి సినిమాకు ప్రభాస్ కొత్త డేట్స్ ఇచ్చాడట.
లేటెస్ట్ టాక్ ప్రకారం ఫిబ్రవరి 23 నుంచి ప్రభాస్ మళ్లీ సెట్స్‌కు రీఎంట్రీ ఇవ్వనున్నాడు. మారుతి టీం ప్రభాస్, మాళవిక మోహనన్ పై వచ్చే సన్నివేశాలను తాజా షెడ్యూల్లో షూట్ చేయనున్నట్టు ఇన్సైడ్ టాక్. సుమారు వారానికి పైగా ఈ షెడ్యూల్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ కాల్షీట్లకు అనుగుణంగా ఈ సినిమా చిత్రీకరణకు ప్లాన్ చేసింది మారుతి టీం. ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి క్లారిటీ రావాలంటే మరికొంత కాలం పట్టే అవకాశాలున్నాయి.
ప్రభాస్ ఖాతాలో ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలున్నాయి. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్-K , ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ సినిమా షూటింగ్ దశలో ఉన్నాయి. ఓం రౌత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ram Charan | అమెరికన్ టీవీ షోలో రాంచరణ్.. తొలి టాలీవుడ్ నటుడిగా సూపర్ క్రేజ్
Ugram teaser | అల్లరి నరేశ్ ఈజ్ బ్యాక్.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ఉగ్రం టీజర్
Dasara | నాని బర్త్ డే స్పెషల్.. సరికొత్తగా దసరా ప్రమోషన్స్ ప్లాన్