Ram Charan | అమెరికన్ టీవీ షోలో రాంచరణ్.. తొలి టాలీవుడ్ నటుడిగా సూపర్ క్రేజ్
రాంచరణ్ (Ram Charan) ఫిబ్రవరి 24న యూఎస్‌లో జరుగబోయే ఆరవ వార్షిక హెచ్‌సీఏ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్‌కు హాజరు కానున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా రాంచరణ్‌కు సంబంధించిన మరో ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Ram Charan | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) యూఎస్‌కు వెళ్తున్నపుడు ఎయిర్‌పోర్టులో మెరిసిన స్టిల్స్ ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ స్టార్ హీరో ఫిబ్రవరి 24న యూఎస్‌లో జరుగబోయే ఆరవ వార్షిక హెచ్‌సీఏ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్‌కు హాజరు కానున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా రాంచరణ్‌కు సంబంధించిన మరో ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. అమెరికా పాపులర్ టెలివిజన్ షో Good Morning Americaలో మెరువబోతున్నాడు రాంచరణ్.
అమెరికా పాపులర్ టీవీ షోలో సందడి చేయబోతున్న తొలి టాలీవుడ్ నటుడు రాంచరణ్ కావడం విశేషం. ఈ షోలో ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన విశేషాలతోపాటు అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌ల గురించి చర్చించనున్నాడు రాంచరణ్. భారత కాలమానం ప్రకారం ఏబీసీ ఛానల్లో ఇవాళ రాత్రి 11:30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. ఈ షోలో రాంచరణ్ తన వ్యక్తిగత, వృత్తిపరమైన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రాంచరణ్ హెచ్‌సీఏ ఫిల్మ్ అవార్డ్స్-2023కు వన్ ఆఫ్ ది ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్నాడు. అమెరికన్ యాక్టర్లు బ్రండోన్ పెరెరా, డేవిడ్ డస్ట్మాల్చియాన్, మేడ్లిన్ క్లైన్, ట్రినిటీ జో-లీ బ్లిస్, వయోలెట్ ఎంసీగ్రాతో కలిసి పాపులర్ హెచ్‌సీఏ ఫిల్మ్ అవార్డ్సులో మెరువబోతున్నాడు రాంచరణ్. ఆర్ఆర్ఆర్ హెచ్‌సీఏ ఫిల్మ్ అవార్డ్స్-2023 ఫైనల్ నామినేషన్స్ లో ఉత్తమ యాక్షన్ సినిమా, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే.
Mega Power Star @alwaysRamCharan is going to be a part of Good Morning America 3, a very popular American talk show. The show will be aired at 1pm PST. Truly a proud moment to see our star on one of the most known shows in the world. #RamCharan pic.twitter.com/xAmf2rir4E
— Ramesh Bala (@rameshlaus) February 22, 2023
Read Also :
Ugram teaser | అల్లరి నరేశ్ ఈజ్ బ్యాక్.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ఉగ్రం టీజర్
Dasara | నాని బర్త్ డే స్పెషల్.. సరికొత్తగా దసరా ప్రమోషన్స్ ప్లాన్
Prabhas | బ్యాక్ టు షూట్.. మారుతి సినిమాకు ప్రభాస్ నయా డేట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

