త్వరలోనే దసరా (Dasara) సినిమాతో సందడి చేసేందుకు రెడీ అంటున్నాడు న్యాచురల్ స్టార్ నాని (Nani). శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే విడుదలై.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. కాగా ఫిబ్రవరి 24న నాని బర్త్ డే సందర్భంగా మేకర్స్ సరికొత్తగా ప్రమోషన్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
భారత సినీ చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా సరికొత్త ప్రమోషన్స్ తో నాని పుట్టినరోజు జరిపేందుకు రెడీ అవుతున్నాం. ఇవాళ సాయంత్రం 4:05గంటలకు ఎక్జయిటింగ్ అనౌన్స్ మెంట్ ఉండబోతుంది. నిశ్శబ్ధంగా ఉండొద్దు.. ఇది దసరా టైం అంటూ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇంతకీ ఆ స్టన్నింగ్ అప్డేట్ ఏంటనేది మరికొన్ని నిమిషాల్లో తెలిసిపోనుంది. దసరా మంట మొదలు అంటూ రిలీజ్ చేసిన లుక్ క్యూరియాసిటీ పెంచుతోంది.
తెలంగాణ బొగ్గు గని బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న విలేజ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న దసరా చిత్రంలో నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దసరా చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్.. కాగా ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ధూమ్ ధాం దోస్తాన్ పాట నెట్టింటిని షేక్ చేస్తోంది. దసరా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
దసరా మంట మొదలు..
Gear up to witness FIRST of its kind Promotions 🔥🔥
Let's celebrate Natural Star @NameisNani Birthday in a MASSIVE way 🔥🔥
Exciting Announcements Loading 💥💥
Don't Keep Calm & Stay tuned to @SLVCinemasOffl#Dasara #DasaraOnMarch30th pic.twitter.com/Kfy5wfykCk
— SLV Cinemas (@SLVCinemasOffl) February 22, 2023
స్టన్నింగ్ మాస్ టీజర్‌పై ఓ లుక్కేయండి..
Ugram teaser | అల్లరి నరేశ్ ఈజ్ బ్యాక్.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ఉగ్రం టీజర్
Prabhas | బ్యాక్ టు షూట్.. మారుతి సినిమాకు ప్రభాస్ నయా డేట్స్