ఫిబ్రవరి 24న న్యాచురల్ స్టార్ నాని (Nani) పుట్టినరోజు సందర్భంగా దసరా (Dasara) స్పెషల్ అప్డేట్ అందించారు మేకర్స్.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీని భారత సినీ చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా ప్రమోట్ చేయబోతున్నట్టు మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. భారతీయ సినిమాలో తొలిసారి.. అతిపెద్ద కౌంట్‌డౌన్ ఇన్స్టాలేషన్ అంటూ ట్వీట్ చేశారు.
దసరా మేకర్స్ నాని 39వ పుట్టినరోజు సందర్భంగా 39 కేంద్రాల్లో దసరా స్పెషల్ హోర్డింగ్స్ ఏర్పాటు చేసి.. దసరా రిలీజ్ టైం కౌంట్‌డౌన్ షురూ చేయబోతున్నారంటూ ఈ ట్వీట్ చదివిన నాని అభిమానులు చర్చించుకుంటున్నారు. అసలు కౌంట్‌డౌన్ ఇన్స్టాలేషన్ ప్లాన్ ఏంటనేదానిపై నాని టీం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
ఇప్పటికే విడుదలైన దసరా టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. తెలంగాణ బొగ్గు గని ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో తెరకెక్కుతున్న దసరా చిత్రంలో కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. డీగ్లామరైజ్డ్ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి దసరా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్. దసరా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
For the FIRST TIME EVER the BIGGEST COUNTDOWN Installations for an INDIAN FILM🔥💥
Team #Dasara is beginning the countdown to the release with MASSIVE INSTALLATIONS at 39 LOCATIONS to celebrate NATURAL STAR @NameisNani's 39th birthday🥳#DasaraOnMarch30th pic.twitter.com/nljPn3EsQl
— SLV Cinemas (@SLVCinemasOffl) February 22, 2023
Ugram teaser | అల్లరి నరేశ్ ఈజ్ బ్యాక్.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ఉగ్రం టీజర్
Dasara | నాని బర్త్ డే స్పెషల్.. సరికొత్తగా దసరా ప్రమోషన్స్ ప్లాన్
Prabhas | బ్యాక్ టు షూట్.. మారుతి సినిమాకు ప్రభాస్ నయా డేట్స్