MIW vs RCBW | డీక్లెర్క్ సిక్సర్ల మోత.. ఉత్కంఠ విజయంతో బోణీ కొట్టిన ఆర్సీబీ..!
MIW vs RCBW : డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ ఆరంభ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదిరే విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో నడినే డీక్లెర్క్(63 నాటౌట్) సిక్సర్ల మోతతో ముంబై ఇండియన్స్‌కు పరాభవం తప్పలేదు.
MIW vs RCBW : డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ ఆరంభ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదిరే విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో నడినే డీక్లెర్క్(63 నాటౌట్) సిక్సర్ల మోతతో ముంబై ఇండియన్స్‌కు పరాభవం తప్పలేదు. 65కే సగం వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని ఆదుకున్న ఈ సఫారీ చిచ్చరపిడుగు.. ఆఖరి ఓవర్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో జట్టును ఒంటిచేత్తో గెలిపించింది. దాంతో.. ఓటమి ఖాయమనుకున్న మంధాన సేన అనూహ్యంగా 3 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్లో మాజీ ఛాంపియన్ శుభారంభం చేసింది. ఫినిషర్ నడినే డిక్లెర్క్(63 నాటౌట్) మెరుపులతో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు షాకిస్తూ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. భారీ ఛేదనను దూకుడుగా ఆరంభించిన ఆర్సీబీకి షబ్నం ఇస్లాయిల్ షాకిచ్చింది. ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన(18)ను ఔట్ చేసి తొలి వికెట్ అందించింది. కాసేపటికే నాట్ సీవర్ బ్రంట్ ఓవర్లో పెద్ద షాట్ ఆడిన గ్రేస్ హ్యారిస్(25) బౌండరీ లైన్ వద్ద షబ్నం చేతికి చిక్కింది. దాంతో.. 45కే ఓపెనర్లు డగౌట్ చేరారు. ఆ తర్వాత 9 పరుగుల వ్యవధిలోనే ఆర్సీబీ బ్యాటర్లు రీచా ఘోష్(6), దయలాన్ హేమలత(7), రాధా యాదవ్(1) ఔటయ్యారు. కీలక బ్యాటర్లు డగౌట్ చేరడంతో ఒత్తిడిలో కూరుకుపోయిన బెంగళూరును గెలుపు దిశగా నడిపించింది నడినే డీక్లెర్క్(63 నాటౌట్), అరుంధతి రెడ్డి(20 )తో కలిసి ఆరో వికెట్‌కు 50 రన్స్ జోడించింది. దాంతో.. ఆర్సీబీ 16 ఓవర్లకు 117 పరుగులు చేసింది.
A #TATAWPL classic in the season opener! 🔥
And we have just begun 😎
What a finish that from Nadine de Klerk! 🤯
Scorecard ▶️ https://t.co/IWU1URl1fr#KhelEmotionKa | #MIvRCB pic.twitter.com/FKyZhLwbto
— Women’s Premier League (WPL) (@wplt20) January 9, 2026
నాట్ సీవర్ బ్రంట్ వేసిన 20వ ఓవర్లో తొలి రెండు బంతులకు ఒక్క రన్ రాలేదు. మూడో బంతిని డీక్లెర్క్ సిక్సర్‌గా మలిచింది, నాలుగో బంతిని ఫైన్ లెగ్‌లో బౌండరీకి పంపింది. ఐదో బంతిని స్టాండ్స్‌లోకి పంపిన ఫినిషర్ మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు తిప్పింది. చివరి బంతికి రెండు రన్స్ అవసరం కాగా బౌండరీతో బెంగళూరును 3 వికెట్ల తేడాతో గెలిపించింది.
సంజన, క్యారీ దంచేశారు
మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ కొట్టింది. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ బ్యాటర్లు సంజీవన సంజన(45) నికోల క్యారీ(40)లు దంచేశారు. వీరిద్దరూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను ఉతికేస్తూ డెత్ ఓవర్లలో బౌండరీల మోత మోగించారు. దాంతో.. ఒక దశలో 120 దాటడమే గగనం అనుకున్న ముంబై అనూహ్యంగా 154 పరుగులు చేయగలిగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Panchayat Raj | ఆరు నెలలకో అధికారి.. పీఆర్ఆర్డీలో మూడేండ్లలో ఆరుగురు స్పెషల్ సీఎస్ల బదిలీ
Exams | విద్యార్థులకు సమ్మర్ టెన్షన్.. పరీక్షల సమయంలో కరెంట్, నీటి కష్టాలు తప్పవా?
SIR | తెలంగాణలో ఓట్ల తొలగింపు కలకలం.. 5.84 లక్షల ఫామ్-7 దరఖాస్తులు.. అసలేం జరుగుతోంది?
Alphabet Shares | రూ.45.76 లక్షల కోట్లు ఫట్… ఒక్కరోజే భారీగా కరిగిపోయిన గూగుల్ విలువ
Crypto Heist | క్రిప్టో చరిత్రలోనే అతిపెద్ద చోరీ.. 20 నిమిషాల్లో రూ.52వేల కోట్ల క్రిప్టో కరెన్సీ మాయం!!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

