కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటించిన స్ట్రెయిట్ తెలుగు చిత్రం సార్ (Sir). తమిళంలో వాథి (Vaathi) టైటిల్‌తో విడుదలైంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వం వహించాడు. సార్ తొలి రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
ఇప్పటికే సార్ చిత్రం తెలంగాణ, ఏపీలో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటి ప్రాఫిట్ జోన్లోకి ఎంటరై.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. సార్ సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వెంకీ అట్లూరి. హ్యాపీ మూడ్‌లో ఉన్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మీ అందరికీ ఓ సర్ప్రైజ్ అంటూ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశాడు.
సార్ సినిమాను విజయవంతం చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మౌత్ టాక్‌కు ఇంత పవర్ ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. అందుకే ధనుష్ సార్ నుంచి, మా సార్ టీం నుంచి మీ అందరికీ ఇవాళ ఒక చిన్న కానుక.. అంటూ వెంకీ అట్లూరి అప్డేట్ ఇచ్చాడు. ఇంతకీ ఆ కానుక ఏంటనేది క్లారిటీ రావాల్సి ఉంది.
సార్ చిత్రంలో సముద్రఖని, తనికెళ్లభరణి, సాయికుమార్, నర్రా శ్రీనివాస్, హైపర్ ఆది ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్‌చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. సార్ చిత్రంలో మలయాళ నటి సంయుక్తామీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది.
వెంకీ అట్లూరి సర్ప్రైజ్ ..!
Director #VenkyAtluri from the bottom of his heart Thanks all the beautiful audiences who made #SIRMovie a huge success ❤️
A surprise for all @dhanushkraja fans dropping today, Real soon… Stay tuned! 🤗@iamsamyuktha_ @gvprakash @dopyuvraj @NavinNooli @vamsi84 #SaiSoujanya pic.twitter.com/oC0gtJqRPA
— BA Raju's Team (@baraju_SuperHit) February 23, 2023
మాస్టారు.. మాస్టారు తెలుగు వెర్షన్..