టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య (Naga Shaurya) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి (Phalana Abbayi Phalana Ammayi). రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.
కాగా చిత్రయూనిట్ నేడు మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి కనుల చాటు మేఘమా సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ లాంఛ్ చేశారు. లక్ష్మి భూపాల రాసిన ఈ పాటను కళ్యాణి మాలిక్ కంపోజ్ చేయగా.. అబ్బాస్ జోషి, ఆలప్ లిప్సిక పాడారు. కనుల చాటు మేఘమా కాస్త ఆగుమా.. వెనుక రాని నీడతో రాయభారమా.. అంటూ సాగుతున్న ఈ పాటను మ్యూజిక్ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావ్, అర్జున్ ప్రసాద్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
కనుల చాటు మేఘమా సాంగ్ లిరికల్ వీడియో..
Season's Breakup ghazal #KanulaChatuMeghama out Now🎶💔
Watch Full Lyrical here👇https://t.co/IxBWoOBwlD#PAPA@IamNagashaurya @iamMalavikaNair#SrinivasAvasarala @vishwaprasadtg@vivekkuchibotla @PSrividya53 pic.twitter.com/dP25yDDvoH
— People Media Factory (@peoplemediafcy) February 23, 2023
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్..