బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 06, 2020 , 12:45:56

81 ఏండ్ల వయస్సులో ఉషాసోమన్ వర్కవుట్స్..వీడియో

81 ఏండ్ల వయస్సులో ఉషాసోమన్ వర్కవుట్స్..వీడియో

మోడల్, యాక్టర్ మిలింద్ సోమన్ ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 54 ఏండ్ల వయస్సులోనూ  ఫిట్ గా ఉండి..ఫిజికల్ ఫిట్ నెస్ విషయంలో ఆదర్శంగా నిలుస్తాడు మిలింద్ సోమన్ . ఇపుడు మిలింద్ సోమన్ తల్లి ఉషా సోమన్ ఫిట్ నెస్ విషయంలో తాను కూడా ఎవరికీ తీసిపోనంటూ వీడియో ద్వారా చెప్తున్నారు.

జులై ౩న ఉషా సోమన్  81వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎనిమిది పదుల వయస్సులోనూ 15 పుష్ అప్స్ వేసి ఔరా అనిపించారు. ఎంతో ఎనర్జిటిక్ గా తన తల్లి చేస్తున్న వర్కవుట్స్ వీడియోను మిలింద్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo