PM Modi | బెంగాల్ మార్పు కోరుకుంటోంది.. రాష్ట్రం అంతటా నందిగ్రామ్ ఫలితాలే : ప్రధాని మోదీ
PM Modi | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని హల్దియా (Haldia) లో ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపై విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల క్రితం నందిగ్రామ్ (Nandigram) లో సీఎం మమతాబెనర్జి (Mamata Banerjee) ఓటమిని గుర్తుచేస్తూ.. ఈసారి పశ్చిమబెంగాల్ రాష్ట్రం అంతటా అదే ఫలితం పునరావృతమవుతుందని చెప్పారు.
PM Modi : పశ్చిమబెంగాల్ (West Bengal) లోని హల్దియా (Haldia) లో ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపై విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల క్రితం నందిగ్రామ్ (Nandigram) లో సీఎం మమతాబెనర్జి (Mamata Banerjee) ఓటమిని గుర్తుచేస్తూ.. ఈసారి పశ్చిమబెంగాల్ రాష్ట్రం అంతటా అదే ఫలితం పునరావృతమవుతుందని చెప్పారు. పశ్చిమబెంగాల్ మార్పును కోరుకుంటోందని, ఈ క్రమంలో బీజేపీ భారీ విజయాన్ని చూస్తామని వ్యాఖ్యానించారు.
నందిగ్రామ్‌లో ఐదేళ్ల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు భవానీపూర్‌తోపాటు మొత్తం బెంగాల్లోనూ అదే ఫలితం వస్తుందని ప్రధాని జోష్యం చెప్పారు. ఇవి సాధారణ ఎన్నికలు కావని, ఈ ఎన్నికలు అభివృద్ధికి, బెంగాల్ చరిత్రను తిరగరాయడానికి ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ టీఎంసీ ప్రభుత్వం బెంగాల్ అభివృద్ధికి అడ్డుపడుతోందని విమర్శించారు. ప్రైవేటు సెక్టార్లలో సామాన్యులను ఉద్యోగాల నుంచి తొలగించి చొరబాటుదారులకు అవకాశం కల్పిస్తోందని ఆరోపించారు.
బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగం ప్రకారం టీఎంసీ చేసిన మోసాలను బయటకు తీస్తామని, బెంగాల్ యువతకు వ్యతిరేకంగా తృణమూల్ చేసిన పాపాలు వందేళ్లు గడిచినా తొలగిపోవని మోదీ వ్యాఖ్యానించారు. ఒక్కసారి డబుల్-ఇంజిన్ సర్కార్ అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఇక్కడ అమల్లోకి వస్తాయని చెప్పారు. బెంగాల్ ప్రజలకు ఆరు హామీలు ఇస్తున్నానని అన్నారు. అన్యాయానికి గురైన ఆడబిడ్డల కేసులను తిరగదోడుతామని, అవినీతికి సాయం చేస్తున్న చట్టాలను రూపుమాపుతామని తెలిపారు.
తృణమూల్ ప్రభుత్వంలో కుంభకోణాలకు, అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని ప్రధాని అన్నారు. శరణార్థులకు రాజ్యాంగం ప్రకారం ప్రత్యేక హక్కులను కల్పిస్తామని, చొరబాటుదారులను మాత్రం దేశం నుంచి తరిమికొడతామని చెప్పారు. ఒక్కసారి బీజేపీ అధికారంలోకి రాగానే 7వ వేతన కమిషన్‌ను అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

