Hardeep Singh Puri | ఖతార్ పర్యటనలో పెట్రోలియం మినిస్టర్ హర్దీప్సింగ్ పురి.. ఎందుకంటే..!
Hardeep Singh Puri | అమెరికా-ఇరాన్ (US-Irann) దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. దేశీయంగా ఇంధన కొరతపై ఆందోళనలు (Energy Crisis) కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి ఖతార్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇవాళ, రేపు ఖతార్‌లో పర్యటించనున్నట్లు సంబంధిత శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
Hardeep Singh Puri : అమెరికా-ఇరాన్ (US-Irann) దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ.. దేశీయంగా ఇంధన కొరతపై ఆందోళనలు (Energy Crisis) కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి ఖతార్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇవాళ, రేపు ఖతార్‌లో పర్యటించనున్నట్లు సంబంధిత శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. అయితే పురి పర్యటనకు సంబంధించిన స్పష్టమైన కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.
కాగా ఇరాన్ ప్రతీకార దాడులకు గురైన గల్ఫ్ దేశాల్లో ఖతార్ కూడా ఒకటిగా ఉన్నది. ఈ దాడుల నేపథ్యంలో ఎల్ఎన్జీ ఉత్పత్తి, ఎగుమతులను ఖతార్ అధికారులు నిలిపివేశారు. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఉత్పత్తులను పునఃప్రారంభించాలని అక్కడి అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పరిమిత కార్యకలాపాలే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలను ఉటంకిస్తూ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పురి ఖతార్‌కు వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 11-12 తేదీల్లో జైశంకర్ పర్యటన ఉండనున్నట్లు సంబంధిత శాఖ పేర్కొన్నది. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో.. భారత్‌లో ఇటీవల ఎల్ఎన్జీ కొరతపై ఆందోళనలు వెల్లువెత్తాయి. అయితే కేంద్రం ఈ ఆందోళనలను కొట్టిపారేసింది. దేశంలో తగినన్ని నిల్వలు ఉన్నాయని, కొరత ఏర్పడుతుందంటూ జరుగుతున్న ప్రచారాలు నిరాధారమైనవని స్పష్టంచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
6 నెలల్లో 23 మరణశిక్షలు.. జడ్జి బదిలీ
సామాన్యుడిపై మరో పిడుగు.. పెరగనున్న సబ్బులు, వంటనూనెల ధరలు
Congress | ‘పట్టభద్రుల’ భయంలో కాంగ్రెస్ సర్కార్.. హైదరాబాద్‌లో నిరసన రద్దు.. ఢిల్లీకి పరుగు
KTR | కేటీఆర్‌తో యువ న్యాయవాదుల భేటీ.. సామాన్యులకు న్యాయం కోసం నిబద్ధతతో పనిచేయాలని లాయర్లకు పిలుపు
Tummidihatti Barrage | ‘తమ్మిడిహట్టి’పై ‘మహా’ సస్పెన్స్.. 152 మీటర్ల ఎత్తుకు ఫడ్నవీస్ ఓకే చెప్తారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

