Urvashi Rautela | వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ మెరిసింది బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా (Urvashi Rautela). ఈ భామ తొలిసారి టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ఎన్బీకే 109లో తొలిసారి ఫీ మేల్ లీడ్ రోల్లో కూడా నటిస్తోంది. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే ఊర్వశి రౌటేలా తెలుగులో మరో సినిమాకు సంతకం చేసిందన్న వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ భామ కొత్త ప్రాజెక్ట్ బాబీ డైరెక్షన్లోనే చేయబోతుందన్న వార్త ఒకటి నెట్టింట షికారు చేస్తోంది.
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ప్రజల మనిషి టైటిల్‌తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు సైన్ చేశాడని ఇప్పటికే ఓ అప్డేట్ తెరపైకి వచ్చిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ హై ఓల్టేజ్ ఎంటర్టైనర్లో ఇద్దరు హీరోయిన్లు ఉండనుండగా.. ఊర్వశి రౌటేలా వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించబోతుందని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఇక మరో భామ డింపుల్ హయతి కూడా రవితేజ పక్కన మరోసారి మెరవనుంది. లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కించనున్న ఈ మూవీ 2024 చివరలో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది.
రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) సినిమా చేస్తున్నాడు. ఆర్సీ 75వ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన సితార్ సాంగ్ నెట్టింట మంచి స్పందన రాబట్టుకుంటోంది.
Hunger | కంటెంట్ మ్యాటర్.. హంగర్‌కు అంతర్జాతీయ గుర్తింపు
Sarfira | అక్షయ్‌కుమార్-సూర్య సర్ఫిరా వసూళ్లు ఎంతంటే..?
Bhahishkarana | అంజలి ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలో..? హాట్ టాపిక్‌గా బహిష్కరణ