Bhahishkarana | ఇటీవలే గాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో డిఫరెంట్ రోల్లో మెరిసింది రాజోలు సుందరి అంజలి. తెలుగు, తమిళం భాషల్లో సూపర్ ఫ్యాన్ పాలోయింగ్ ఉన్న ఈ భామ తాజాగా బహిష్కరణ (Bhahishkarana) వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తుందని తెలిసిందే. ఇటీవలే ట్రైలర్ కూడా విడుదల చేశారు మేకర్స్. మంచోడు చేసే మొదటి తప్పేంటో తెలుసా..? చెడ్డోడి చరిత్ర తెలుసుకోవడమే.. మనసే ఏమంటుందయ్యా అని అడిగితే ఇంకా కొత్త రుచులేమైనా ఉంటే బాగుంటుందనిపిస్తుంది.. అంటూ సాగే డైలాగ్స్‌తో మొదలైంది ట్రైలర్.
బాగా నచ్చాలి.. పిచ్చి ఉండాలి రా మనిసంటే.. ప్రేయసి గురించి చెప్తుంటాడు హీరో (శ్రీ తేజ్). లోకంలో ప్రతీ యుద్దం స్వార్థంతోనే మొదలవుతుందని విలన్ అంటున్నాడు. ఈ డబ్బు కోసమేనా ఇంకా ఇక్కడున్నావ్ అని అంజలిని అడిగితే.. ఈ డబ్బు కోసం నేనిన్ని రోజుల ఇక్కడున్నానుకుంటున్నావా..? అసలు మీ ఊళ్లో ఎలాంటి మనుషులున్నారో నీకు తెలుసా..? అని ప్రియుడిని అడుగుతుంది అంజలి.
మా కాళ్ల కింద బతకడానికి మా పక్కలో నలగడానికి పుట్టినోళ్లే మీరు అంటూ సాగుతున్న సంభాషణలు సినిమా అగ్రవర్ణాలు అణగారిన వర్ణాల మీద చూపించే వివక్ష నేపథ్యంలో ఉండబోతుందని హింట్ ఇచ్చేస్తున్నాయి. ఇంతకీ అంజలికి ఎలాంటి అన్యాయం జరిగింది.. దీనికి ఎలా ప్రతీకారం తీసుకుందనే నేపథ్యం వెబ్ సిరీస్‌లో చూపించబోతున్నట్టు తెలియజేశారు మేకర్స్.
పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ 5లో జులై 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది బహిష్కరణ. ఈ ప్రాజెక్ట్‌ను జీ5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా సంయుక్తంగా తెరకెక్కించాయి. అంజలి బోల్డ్ అవతార్‌తో సాగుతున్న ట్రైలర్ ఇంప్రెసివ్‌గా సాగుతూ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
బహిష్కరణ ట్రైలర్