Hunger | కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమా (షార్ట్ ఫిల్మ్)నైనా ప్రేక్షకులు ఆదరిస్తారని కొత్తగా చెప్పనవసరం లేదు. అది అది షార్ట్ ఫిల్మా, చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని ఆలోచించకుండా హిట్ చేసేస్తారు. తాజాగా అదే జాబితాలో చేరిపోయింది హంగర్. గోపాల్ బోడేపల్లి తెరకెక్కించిన తాజా చిత్రం హంగర్ వార్తల్లో నిలిచింది.
ఈ చిత్రానికి ఇటీవలే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. హంగర్ ఇంటర్నేషనల్ న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో హానరబుల్ మెన్షన్ అవార్డును గెలుచుకుంది. అంతేకాదు హంగర్ పారిస్, లండన్ ఉత్సవాలతోపాటు మరో 10 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులను గెలుచుకోవడం విశేషం. గోపాల్ బోడేపల్లి గతంలో డైరెక్ట్ చేసిన మరణం షార్ట్ ఫిల్మ్ కూడా 34 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు గెలుచుకోవడం విశేషం. హంగర్, మరణం రీసెంట్గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల్లో అఫీషియల్ సెలెక్షన్‌కు కూడా ఎంపికయ్యాయి.
Kannappa | మంచు విష్ణు కన్నప్పలో శరత్ కుమార్ పాత్ర ఇదే.. లుక్ వైరల్
Sarfira | అక్షయ్‌కుమార్-సూర్య సర్ఫిరా వసూళ్లు ఎంతంటే..?
Bhahishkarana | అంజలి ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలో..? హాట్ టాపిక్‌గా బహిష్కరణ