90లలో టాలీవుడ్ (Tollywood)లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కన్నడ హీరోల్లో ఒకడు ఉపేంద్ర (Upendra). ఒకానొక టైంలో ఉపేంద్ర డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో మంచి ప్రేక్షకాదరణ పొందాయి. అయితే ఆ తర్వాత శాండల్‌వుడ్ (Sandalwood )పై ఫోకస్ పెట్టి లీడ్ హీరోగా ఫుల్ బిజీ అయిపోయాడు. అయితే ప్రతీ హీరోకు ఉన్నట్టే ఈ స్టార్ హీరోకు ఓ తీరని కోరిక ఉందట. అదేంటో గని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు.
ఉపేంద్ర టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని డైరెక్ట్ చేయాల్సి ఉండేదట..అవును మీరు విన్నది నిజమే. ఇదే విషయం గురించి మాట్లాడుతూ..’1997లో రాజశేఖర్ హీరోగా ఉపేంద్ర డైరెక్ట్ చేసిన ఓంకారం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత చిరంజీవితో నేను సినిమా చేయాల్సి ఉండేదంటే మీరు నమ్ముతారా..? అశ్వినీదత్ కు చెందిన ప్రొడక్షన్ బ్యానర్లో చిరంజీవితో సినిమా చేసేందుకు నాకు అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటివరకు నాకు మిగిలిపోయిన ఒకే ఒక్క కోరిక. అయితే దీని తర్వాత మళ్లీ చిరంజీవితో కలిసి పనిచేసే అవకాశం రాలేదన్నాడు’ ఉపేంద్ర.
నాగబాబుతో ఒకే మాట సినిమాలో నటించి మెగా ఫ్యామిలీకి దగ్గరయ్యారని గుర్తు చేసుకున్నాడుఉపేంద్ర. ఆ తర్వాత అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి చేశారు. ఇపుడు వరుణ్ తేజ్ (Varun Tej) తో కలిసి గని సినిమా చేస్తున్నా. మెగా ఫ్యామిలీ హీరోలు నన్ను తెలుగు ప్రజలకు రీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారనిపిస్తుందని చెప్పుకొచ్చాడు ఉపేంద్ర.