నాలుగు పదుల వయస్సు దగ్గరకొస్తున్నా అందంలో అప్ కమింగ్ హీరోయిన్లకు నేనేం తీసిపోనంటోంది టాలీవుడ్ (Tollywood) మల్లీశ్వరి కత్రినాకైఫ్ (Katrina Kaif) . గతేడాది డిసెంబర్లో బాలీవుడ్ (Bollywood) హీరో విక్కీకౌశల్ (Vicky Kaushal)ను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ భామ రెట్టింపు అందంతో మెరిసిపోతుంది. పెళ్లయిన తర్వాత హనీమూన్ ట్రిప్ వేయకుండా..ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ తో కొంతకాలంగా బిజీగా ఉన్న ఈ భామ ఇటీవలే తన హస్బెండ్తో సమ్మర్ వెకేషన్కు వెళ్లిన విషయం తెలిసిందే.
మాల్దీవులు వెకేషన్ (Maldives) లో బీచ్లో సరదాగా షికారు చేస్తోంది కత్రినా. ఐలాండ్ తీర ప్రాంతాల్లో మోనోకినీ బికినీ వేర్లో అందాల ఆరబోస్తూ నెటిజన్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇసుకతిన్నెల్లో బ్లాక్ స్విమ్ షూట్లో మ్యాచింగ్ బీచ్ హ్యాట్ను పెట్టుకుని బొమ్మలా కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. తన అందాలను విక్కీకౌశల్ కెమెరాలో బంధించగా..ఆ స్టిల్స్ లో కొన్నింటిని తన అభిమానులు, ఫాలోవర్ల కోసం నెట్టింట పోస్ట్ చేసి..ఎండలకు అసలే ఉక్కపోతతో ఉడికిపోతున్న నెటిజన్లకు ఊపిరాడకుండా చేస్తోంది.
ఈ బ్యూటీ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి టైగర్ 3 సినిమాలో నటిస్తోంది. టైగర్ ప్రాంఛైజీలో వస్తున్న ఈ చిత్రాన్ని జోయా అక్తర్ డైరెక్ట్ చేస్తున్నారు. మరోవైపు తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి మేరీ క్రిస్మస్ సినిమాలో నటిస్తోంది.