Upasana | టాలీవుడ్ (Tollywood) స్టార్ నటుడు రామ్ చరణ్ (Ram Charan) -ఉపాసన (Upasana) దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. పెండ్లైన పదకొండేండ్లకు వీరు తమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. దీంతో అటు మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. కాగా, ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన (Upasana) లేట్ ప్రెగ్నెన్సీ (late pregnancy) గురించి స్పందించారు. సమాజం కోరుకున్నప్పుడు కాకుండా తమకు నచ్చినప్పుడు పిల్లల్ని కనాలనుకున్నాం అని తెలిపారు.
‘ఇప్పుడు నేను చాలా సంతోషంగా, గర్వంగా ఫీలవుతున్నా. సమాజం కోరుకున్నప్పుడు కాకుండా నాకు ఇష్టమైనప్పుడే తల్లిని అవుతున్నందుకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. సామాజిక ఒత్తిడికి లొంగకుండా మా నిర్ణాయానికి కట్టుబడి ఉన్నాం. ఇది మా పరస్పర నిర్ణయం. ఒక జంటగా.. బయట సమాజం నుంచి, మా కుటుంబం నుంచి మేము ఒత్తిడికి తావివ్వలేదు. పెండ్లైన పదేండ్ల తర్వాత ఇప్పుడు మేం పిల్లల్ని కోరుకున్నాం. ఇదే మంచి సమయం అనిపించింది. ఇప్పుడు మేమిద్దరం ఆర్థిక భద్రతతో ఉన్నాం. పిల్లల్ని చూసుకోగలం’ అని చెప్పుకొచ్చింది.
Also Read..
Nayanthara | నయనతార కవల పిల్లల పేర్లేంటో తెలుసా..?
India Corona | వరుసగా మూడోరోజూ 3వేలకు పైనే కొత్త కేసులు.. 20వేలు దాటిన యాక్టివ్ కేసులు
Balagam Movie | బలగం సినిమాకు అవార్డుల పంట.. మరో ఇంటర్నేషనల్ అవార్డు