Nayanthara | నయనతార కవల పిల్లల పేర్లేంటో తెలుసా..?
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara)-విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) దంపతులు గతేడాది సరోగసీ ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరికి ఏం పేర్లు పెట్టి ఉంటారోనని తెగ చర్చించుకోవడం మొదలుపెట్టారు సినీ జనాలు.
ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్తో కలిసి జవాన్లో నటిస్తోంది కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara). అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం 2023 జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే విఘ్నేష్ శివన్ (Vignesh Shivan)-నయనతార దంపతులు గతేడాది సరోగసీ ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఆ ఇద్దరికి ఏం పేర్లు పెట్టి ఉంటారోనని తెగ చర్చించుకోవడం మొదలుపెట్టారు సినీ జనాలు.
అయితే నయనతార చాలా రోజుల తర్వాత తమ పిల్లలకు ఏం పేర్లు పెట్టిందో తెలియజేసింది. నయనతార మీడియాతో చిట్ చాట్ సెషన్లో మాట్లాడుతూ.. తన పిల్లలకు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ (Uyir RudroNeel N Shivan), ఉలగ్ దీవిక్ ఎన్ శివన్ (Ulag Daiwik N Shivan) పేర్లు పెట్టినట్టు వెల్లడించింది. నయనతార, విఘ్నేశ్ శివన్ పేర్లు కలిసి వచ్చేలా ఇద్దరు పిల్లలకు నామకరణం చేసినట్టు అర్థమవుతోంది.
మరోవైపు ఇదే విషయాన్ని తెలియజేస్తూ విఘ్నేశ్ శివన్ కూడా ట్వీట్ చేశాడు. అయితే దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ పేర్లు చాలా కొత్తగా ఉన్నాయి.. అని కొందరు అంటుంటే.. పలుకడానికి కష్టంగా ఉందని మరికొందరు అంటున్నారు. అభినందనలు సర్.. మీరు పెట్టిన పేర్లు వారికి (పిల్లలకు) మీ విలువను తెలియజేస్తాయి.. అని నటుడు అశోక్ సూర్య కామెంట్ చేశాడు.
సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది నయనతార. ఈ టాలెంటెడ్ హీరోయిన్ మరోవైపు అహ్మద్ దర్శకత్వంలో ఇరైవన్ చిత్రంలో నటిస్తోంది. ఇరైవన్ విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.
Dear friends ❤️
We have named our blessings , our babies like this ❤️#Uyir RudroNeel N Shivan
உயிர் ருத்ரோநீல் N சிவன்#Ulag Daiwik N Shivan
உலக் தெய்விக் N சிவன்N stands for their best mother in the world #Nayanthara ❤️
Happiest & proudest moments of life #Blessed pic.twitter.com/r4RHp0wC8f
— VigneshShivN (@VigneshShivN) April 3, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

