Loksabha Elections 2024 : దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.
ఇక మధ్యాహ్నం 1 గంట వరకూ దేశవ్యాప్తంగా 40.3 శాతం పోలింగ్ నమోదైంది.యూపీలోని కన్నౌజ్ బరిలో నిలిచిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం తిరిగివెళుతూ ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రజలు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. నిజాయితీ లేని పాలకుల నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో పాలుపంచుకోవాలని అఖిలేష్ యాదవ్ పిలుపు ఇచ్చారు.
Read More :