అమరావతి : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏపీ(Andhra Pradesh)లో పోలింగ్ మధ్యాహం వరకు మరో 15 శాతం పెరిగింది . మధ్యాహ్నాం 1 గంట వరకు ఉన్న 40.26 శాతం ఉన్న పోలింగ్ ప్రస్తుతం 55.49 శాతానికి పెరిగింది. ఏపీలో 25 లోక్సభ(Lok sabha) , 175 అసెంబ్లీ (Assembly) స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు నియోజకవర్గాలో సాయంత్రం 4 గంటలకు, మరో మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనున్నది. మిగతా 169 నియోజకవర్గాలో సాయంత్రం 6 గంటల వరకు యథావిధిగా ఎన్నికలు జరుగనున్నాయి.
అనేక చోట్ల మహిళలు(Womens), వృద్ధులు (Oldge People) భారీ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించు కునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. విజయవాడ సెంట్రల్లో 37.12 శాతం, విజయవాడ ఈస్ట్ 42.3, విజయవాడ వెస్ట్ 37 శాతం, జగ్గయ్యపేట 44.7 శాతం పోలింగ్ జరిగింది. భీమిలిలోనూ 50 శాతం కంటే తక్కువ పోలింగ్ జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో 54.87, విజయనగరంలో 54.31, మన్యం జిల్లాలో 51.75, విశాఖ జిల్లాలో 46.01, అల్లూరి జిల్లాలో 48.87 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
అద్దంకిలో 46.45, బాపట్లలో 43.52, చీరాలలో 38.08, పర్చూరులో 48.81 శాతం పోలింగ్ నమోదయ్యింది. విశాఖలోని ఐదు నియోజకవర్గాల్లోనూ తక్కువ పోలింగ్ జరిగింది . పాడేరులో భారీ వర్షం కురియడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు.