Rashmika Mandanna | నేషనల్ క్రష్ డేట్స్ ఖాళీ లేవు.. నిర్మాతలు ఏడాది పాటు నిరీక్షించాల్సిందే!
కన్నడ సోయగం రష్మిక మందన్న తారాపథంలో దూసుకుపోతున్నది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుసగా భారీ సినిమాలతో బిజీబిజీగా మారింది. మరో ఏడాది పాటు ఈ అమ్మడి డేట్స్ ఖాళీ లేవు అంటున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో ఆరు సినిమాలున్నాయి.
Rashmika Mandanna | కన్నడ సోయగం రష్మిక మందన్న తారాపథంలో దూసుకుపోతున్నది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుసగా భారీ సినిమాలతో బిజీబిజీగా మారింది. మరో ఏడాది పాటు ఈ అమ్మడి డేట్స్ ఖాళీ లేవు అంటున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో ఆరు సినిమాలున్నాయి. వీటి షూటింగ్స్ మొత్తం పూర్తి కావడానికి ఏడాదికిపైగా సమయం పడుతుందంటున్నారు. దాంతో ఈ భామ డేట్స్ కావాలంటే మరో ఏడాది పాటు ఆగాల్సిందే.
ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో పుష్ప-2, రెయిన్బో, గర్ల్‌ఫ్రెండ్, కుబేర చిత్రాల్లో నటిస్తున్నది. ‘పుష్ప-2’ చిత్రీకరణ తుదిదశకు చేరుకోగా..మిగిలిన మూడు చిత్రాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఇక బాలీవుడ్లో ‘యానిమల్’ బ్లాక్‌బస్టర్ విజయంతో ఈ సొగసరికి అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ‘సికిందర్’ సినిమాలో సల్మాన్‌ఖాన్‌తో జోడీ కట్టబోతున్నది. విక్కీకౌశల్తో ‘ఛావా’ సినిమాలో నటిస్తున్నది. హిందీలో మరికొన్ని ఆఫర్లొచ్చినా..డేట్స్ ఖాళీలేని కారణంగా రష్మిక అంగీకరించలేదని అంటున్నారు. మొత్తంగా చూస్తే మరో ఏడాది పాటు రష్మిక మందన్న డేట్స్ దొరకడం కష్టమేనని ఫిల్మ్‌సర్కిల్స్‌లో వినిపిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

