హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్ సాగుతుంది. ఉదయం 6.30 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో హీరోలు జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR), అల్లు అర్జున్ (Allu Arjun) తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
తల్లి, సతీమణితో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్.. అందరితో కలిసి క్యూలైన్లో నిల్చున్నారు. తన వంతు వచ్చినప్పుడు ఆయన ఓటు వేశారు. అదేవిధంగా ఉదయాన్నే ఫిలింనగర్‌లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్‌లో ఉన్న పోలింగ్ కేంద్రానికి వచ్చిన అల్లు అర్జున్.. అందరితోపాటు ఆయన తన వంతు కోసం క్యూలైన్లో వేచిఉండి ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, సన్నిహితులైనవారికి మద్దతునిస్తానని చెప్పారు.
ఇక మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తన సతీమణితో కలిసి ఫిలింనగర్‌లోని ఓబుల్‌రెడ్డి పాఠశాలలో, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ మాదాపూర్‌లో ఓటేవేశారు.
#WATCH | Telangana: Actor Jr NTR arrives at a polling booth in Jubilee Hills, Hyderabad to cast his vote. #LokSabhaElections2024 pic.twitter.com/irFIjHVGVq
— ANI (@ANI) May 13, 2024
#WATCH | Telangana: Actor Allu Arjun says “Please cast your vote. It is the responsibility of all the citizens of the country. Today is the most crucial day for the next 5 years. There will be a huge voter turnout, as more and more people are coming out to vote…I would like to… pic.twitter.com/y5EwVLZVRk
— ANI (@ANI) May 13, 2024