Balagam Movie | బలగం సినిమాకు అవార్డుల పంట.. మరో ఇంటర్నేషనల్ అవార్డు
Balagam Movie | ప్రముఖ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన బలగం బాక్సాఫీస్ దగ్గర కాసలు వర్షం కురిపిస్తుంది. తొలి సినిమాతోనే వేణు దర్శకుడిగా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. కమర్షియల్‌గానే కాకుండా అవార్డుల్లోనూ ఈ సినిమా సత్తా చాటుతుంది.
Balagam Movie | ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది బలగం మూవీ. ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి తొలివారంలో విడుదలైంది. మొదటి రోజు నుంచి పాజిటీవ్ రివ్యూలు తెచ్చుకుని ఇప్పటికీ మంచి ప్రదర్శనను కొనసాగిస్తుంది. తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి పచ్చదనాన్ని, మానవ బంధాల పరిమళాన్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన తీరుకు వేణుపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురపిస్తున్నారు. ఇటీవలే ఓటీటీలో విడుదలై మరింత ఆదరణ దక్కించుకుంది. పల్లెల్లో ఆరుబయట స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని మరీ ఈ సినిమాను ప్రేక్షకులు వీక్షిస్తున్నారు.
బలగం సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పడింది. సుమారు రెండు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.25 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి పదింతలు లాభాలు తెచ్చిపెట్టింది. ఇక కమర్షియల్‌గానే కాదు అవార్డుల పరంగానూ బలగం సినిమా సత్తా చాటుతుంది. ఇటీవలే బలగం సినిమా రెండు లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులు అందుకుంది. కాగా ఇప్పుడు మరో ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకుంది. బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఒనికో ఫిల్మ్ అవార్డు(ఉక్రెయిన్) సొంతం చేసుకుంది. దీనిపై చిత్రబృందం ఇదంతా ప్రేక్షకుల వల్లే సాధ్యమైందంటూ ట్వీట్ చేసింది.
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మించాడు. సినిమా రిలీజై నెలరోజులు అవుతున్నా ఇంకా ఈ మూవీ కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. ఈ సినిమాతో వేణుకు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తున్నాయి. తన నెక్స్ట్ సినిమా కూడా దిల్‌రాజు బ్యానర్లోనే తెరకెక్కుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా గీతాఆర్స్ట్ నుంచి కూడా వేణుకు పిలుపు వచ్చినట్లు టాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

