నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable 2 With NBK) షోతో రెట్టిపు వినోదాన్ని అందిస్తున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ ప్రీమియర్ కాగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ షో మూడో ఎపిసోడ్‌కు రాబోయే అతిథులెవరో ఆహా టీం ప్రకటించేసింది. యువ హీరోలు శర్వానంద్, అడివిశేష్ ఎపిసోడ్-౩లో మెరువబోతున్నారు.
నవంబర్ 4న ప్రీమియర్ కానున్న ఈ ఎపిసోడ్లో బాలకృష్ణతో కలిసి సందడి చేయబోతున్నారు శర్వానంద్, అడివి శేష్. బాలకృష్ణ, యువ హీరోల మధ్య ఎలాంటి చిట్‌చాట్ తో ఈ ఎపిసోడ్ సాగనుందనే దానిపై క్లారిటీ రావాలంటే ప్రోమో వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఎపిసోడ్ 3 ఫొటోలు కొన్ని నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
బాలకృష్ణ ఇటీవలే మొదటిసారి కమర్షియల్ యాడ్‌తో కూడా ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేస్తున్న వీరసింహారెడ్డి షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు అనిల్ రావిపూడితో ఎన్బీకే108 సినిమా చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు బాలకృష్ణ.
ఎపిసోడ్-౩ ఫొటోలు..
The 2 #MostEligibleBachelors of Tollywood with the NataSimham #NandamuriBalaKrishna on India's most rated talk show #UnstoppableWithNBKS2
😍😍Episode 3 premieres November on aha Video #NandamuriBalakrishna #NBKOnAHA Sesh Adivi Sharwanand pic.twitter.com/MdPhc3Nw3e
— Balayya Yuvasena (@BalayyaUvasena) October 30, 2022
The #LION is #Unstoppable
Amazing talking to NBK sir about Life, Love & #HIT2 releasing on the #Akhanda date : December 2nd❤️
When is the episode out? @ahavideoIN pic.twitter.com/qbhkRKDLst
— Adivi Sesh (@AdiviSesh) October 30, 2022
Read Also : Puri Jagannadh | అందరం కలిసేది స్మశానంలోనే.. మధ్యలో జరిగేదంతా డ్రామా.. పూరీ జగన్నాథ్
Read Also : Kamal Haasan | ప్రేక్షకులపై గొప్ప బాధ్యత ఉంది.. ఏదైనా వారే నిర్ణయిస్తారు.. కమల్ హాసన్
Read Also : Nani | సంతోష్ శోభన్‌లో నన్ను నేను చూసుకున్నా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని
Read Also : Varun Tej | పిక్ టాక్.. వర్షంలో వరుణ్ తేజ్, నాగబాబు ఇంతకీ ఎక్కడికెళ్లారు.. ?