PM Modi | ప్రధాని మోదీకి బెల్జియం ప్రధాని ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఇదే..!
PM Modi | భారత ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కోసం బెల్జియం ప్రధాని (Belgium Prime Minister) బార్ట్ డి వెవర్ (Bart De Wever) ప్రత్యేకంగా ‘ఇండియా గేట్ (India Gate)’ ఆకృతిలో ఉన్న చాక్లెట్‌ను తయారు చేయించారు. అయితే అది భారత్‌కు తీసుకొచ్చే క్రమంలో మార్గమధ్యలోనే కరిగిపోయి పాడైంది.
PM Modi : భారత ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కోసం బెల్జియం ప్రధాని (Belgium Prime Minister) బార్ట్ డి వెవర్ (Bart De Wever) ప్రత్యేకంగా ‘ఇండియా గేట్ (India Gate)’ ఆకృతిలో ఉన్న చాక్లెట్‌ను తయారు చేయించారు. అయితే అది భారత్‌కు తీసుకొచ్చే క్రమంలో మార్గమధ్యలోనే కరిగిపోయి పాడైంది. దాంతో బెల్జియం ప్రధాని ఆ చాక్లెట్‌ను ప్రధానికి ఇవ్వలేకపోయారు.
ఈ క్రమంలో భారత్‌లో బెల్జియం (Belgium) దౌత్యకార్యాలయం తాము తయారు చేయించిన ‘ఇండియా గేట్ చాక్లెట్’ చిత్రాన్ని ఎక్స్ వేదికగా పంచుకుంది. భారత్ పర్యటన సందర్భంగా మోదీకి ఈ వినూత్న కానుకను అందించాలని వెవర్ భావించారు. అయితే భారత్‌కు తీసుకొస్తుండగా కరిగిపోవడంతో అందించలేకపోయారు. మరో ప్రతిరూపం బెల్జియంలో సిద్ధంగా ఉందని, దానిని ఎలాగైనా సురక్షితంగా మోదీకి అందిస్తానని ఆయన చెప్పారు.
‘ఇండియా గేట్‌ను అత్యుత్తమ బెల్జియం చాక్లెట్లతో రూపొందించి మోదీకి కానుకగా ఇవ్వాలని అనుకున్నా. అసలైన ఇండియా గేట్ చెక్కు చెదరకుండా ఉంది. కానీ చాక్లెట్‌తో చేసిన ప్రతిరూపం భారత్‌కు చేరుకునేలోపే పాడైంది’ అంటూ వెవర్ సరదాగా వ్యాఖ్యానించారు. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో బెల్జియంలో పోరాడిన భారత సైనికుల త్యాగానికి గుర్తుగా ఇండియా గేట్‌ను నిర్మించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

