Iran | ఇరాన్లో ఆయిల్ ట్యాంకర్ పేలుడు.. 11 మంది మృతి.. ఏడుగురికి గాయాలు
Iran : ఇరాన్లో భారీ పేలుడు సంభవించి 11 మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఇరాన్, కుర్దెస్తాన్ ప్రావిన్స్‌లోని సనందాజ్ కౌంటీని, హమేదాన్ ప్రావిన్స్‌లోని హమేదాన్ కౌంటీని కలిపే రోడ్డు మార్గంలో జరిగింది.
Iran : ఇరాన్లో భారీ పేలుడు సంభవించి 11 మంది మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ ఇరాన్, కుర్దెస్తాన్ ప్రావిన్స్‌లోని సనందాజ్ కౌంటీని, హమేదాన్ ప్రావిన్స్‌లోని హమేదాన్ కౌంటీని కలిపే రోడ్డు మార్గంలో జరిగింది. ఈ ఘటన విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రాథమిక సమచారం ప్రకారం.. ఈ రోడ్డు మార్గంలో ఆయిల్ ట్యాంకర్ వెళ్తుండగా బ్రేక్స్ ఫెయిలయ్యాయి. దీంతో ఆయిల్ ట్యాంకర్.. దాని ముందున్న వాహనాలను ఢీకొంది. ఈ క్రమంలో ఆయిల్ ట్యాంకర్ పేలి, మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న కార్లతోపాటు, ఇతర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో భారీ పేలుడు జరిగి, ఆ వాహనాల్లోని 11 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు అక్కడికి చేరుకుని క్షతగాత్రుల్ని సనందాజ్‌లోని ఆస్పత్రులకు చికిత్స కోసం తరలించారు.
ఈ పేలుడు కారణంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కూడా స్తంభించింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బ్రేకులు ఫెయిల్ అవ్వడం కారణంగానే ఈ పేలుడు జరిగిందని భావిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. ఆ తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయి. మృతులకు సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- blast
- fuel tanker
- iran
- Sanandaj
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

