టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ (Santosh Shobhan), జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా కాంబినేషన్లో వస్తున్న చిత్రం లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ (LikeShareSubscribe Trailer). ఫన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌కు ఇప్పటికే మంచి స్పందన వస్తుంది. నవంబర్ 4న విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌కు న్యాచురల్ స్టార్ నాని ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు.
ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ..గోల్కొండ హైస్కూల్లో శోభన్ నటనకు తాను ఇంప్రెస్ అయ్యానని, శోభన్‌కు అది మొదటి స్క్రీన్ అప్పియరెన్స్ అని అన్నాడు. శోభన్‌లో తన చిన్ననాటి స్వభావాన్ని (నన్ను నేను చూసుకున్నా) చూశానన్నాడు. శోభన్ చాలా ప్రామిసింగ్ సబ్జెక్టుల్లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు.
జాతిరత్నాలు సినిమాలో ఫరియా అబ్దుల్లా నటన తనకు నచ్చిందని, ఫరియాకు విషెస్ కూడా చెప్పానన్నాడు. బ్రహ్మాజీతో తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న నాని.. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. మేర్లపాక గాంధీ మాటలను అందరూ ఇష్టపడతారని, తమ కాంబినేషన్లో వచ్చిన కృష్ణార్జున యుద్ధం సినిమా చాలా ఫన్‌గా సాగిందని చెప్పుకొచ్చాడు.
లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్ ట్రైలర్..
రాబోయే రోజుల్లో నిర్మాత వెంకట్ బోయనపల్లి మంచి మంచి సినిమాలను నిర్మిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పాడు. తాను కూడా నిర్మాత వెంకట్ కు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చాడు. అంటే నాని భవిష్యత్‌లో నిర్మాత వెంకట్ బోయనపల్లితో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడన్నమాట.
లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తూ మేర్లపాక టీంకు శుభాకాంక్షలు తెలియజేశాడు నాని . ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిర్యాల.