Polytechnic Student | పాలిటెక్నిక్ విద్యను ఆగం చేసేందుకు రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన జీవో 97ను వెంటేనే రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే కొణింటి మానిక్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ విఫలపాలనపై నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఓ పాలిటెక్నిక్ విద్యార్థిని సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యింది. నువ్ ఫాంహౌస్ నుంచి బయటకు రా అని కేసీఆర్ మీద పడి ఏడవడం కాదు.. మాకు స్కాలర్షిప్ ఇస్తావా లేదా? మేం పేద బిడ్డలం.. ఆడబిడ్డలం.. రేవంత్ రెడ్డికి చెప్తున్నా మా ఉసురు నీకు తగులుతది.. ఖబడ్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరించింది.
ఈ స్టేజీపై నుంచి నేను నీకు సవాల్ చేస్తున్నా. మేమందరం ఉన్నం.. అందరం ఒక పిడికిలాగా ఉన్నం.. నువ్వెనివయ్యా.. ఎవడున్నడు నీ వెంట.. రాహుల్ గాంధీ ఉన్నడా రమ్మను. స్టూడెంట్స్ అంతా ఉన్నం.. మేమనుకుంటే చేయలేమా..? ఏమన్నా.. మేం మా క్లాసులు వదిలిపెట్టుకొని వస్తున్నమంటే ఆలోచించు బుర్రుంది కదా.. ఇచ్చిండు కదా దేవుడు.. గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి నువ్వు గనుక ఫీజు రీయింబర్స్ మెంట్ చేయకపోతే నీ ఇంటి ముందుకొచ్చి చేస్తం ధర్నా.. జాగ్రత్తగా ఉండు రేవంత్ రెడ్డి అని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మా ఉసురు నీకు తగులుతుంది రేవంత్ రెడ్డి
కేసీఆర్ మీద పడి ఏడవడం కాదు.. మాకు స్కాలర్షిప్ ఇస్తావా లేదా?
ఖబడ్దార్ రేవంత్ రెడ్డి.. స్టూడెంట్స్ అనుకుంటే ఏమైనా చేస్తాం
నువ్వు ఫీజ్ రీయింబర్స్మెంట్ చేయకపోతే స్టూడెంట్స్ అందరూ నీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తాము
బుర్ర ఉందిగా రేవంత్… pic.twitter.com/BCBmIS40yh
— Telugu Scribe (@TeluguScribe) September 6, 2026
Bittu Tabahi | నదిని శుభ్రం చేసిన యువకుడు.. బిట్టు తబాహికి పద్మ ఇవ్వాలన్న సింగర్ చిన్మయి!
న్యూడ్ ఫొటోలతో కాంగ్రెస్ నాయకుడి బెదిరింపులు.. సూర్యాపేటలో మహిళ ఆత్మహత్యాయత్నం
Bigg Boss | బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్లకుండానే ఎలిమినేషన్.. క్రిటిక్కి షాకిచ్చిన ఆడియన్స్!