Marco | జనతాగ్యారేజ్, ఖిలాడీ, యశోద సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan). ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇటీవలే మార్కో (Marco) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. తొలి ఏ రేటెడ్ మలయాళం మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మార్కో రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది.
యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ఇషాన్ శౌలత్, అభిమన్యు ఎస్ థిలకన్, యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్, సిద్దిఖీ కీలక పాత్రల్లో నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. షరీఫ్ అహ్మద్ తెరకెక్కించారు. మరి ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
M🅰️RCO Storms into 1️⃣0️⃣0️⃣CR Club Worldwide🌍#Marco #running #successfully #blockbuster #incinemasnow pic.twitter.com/YqtqvOOPfM
— Unni Mukundan (@Iamunnimukundan) January 5, 2025
Madha Gaja Raja | 12 ఏండ్లకు థియేటర్లలోకి.. విశాల్ మదగజరాజ రిలీజ్ టైం ఫిక్స్
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్