NBK107 Title | నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఆరు పదుల వయసు దాటినా యాక్షన్ సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు పోటినిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో నందమూరి ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న బాలయ్య.. గతేడాది ‘అఖండ’తో ఫుల్ మీల్స్ పెట్టాడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలయ్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ప్రస్తుతం బాలకృష్ణ అదే జోష్‌తో గోపిచంద్ మలినేని చిత్రాన్ని చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమా కోసం చిత్రబృందం ‘రెడ్డిగారు’, ‘వీర సింహా రెడ్డి’ అనే రెండు పవర్ ఫుల్ టైటిల్స్‌ను పరిశీలనలో ఉంచారట. అయితే ఇందులో ఏదో ఒక దానిని ఫైనల్ చేస్తారట. టైటిల్సే ఈ రేంజ్లో ఉంటే సినిమా ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో అని నందమూరి అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య రెండు గెటప్స్‌లో కనిపించనున్నట్లు టాక్. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి డిసెంబర్ చివరివారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.
Read Also:
Chennakeshava Reddy | రీ-రిలీజ్ కలెక్షన్లతో ‘జల్సా’ రికార్డు బ్రేక్ చేసిన బాలకృష్ణ.. కానీ?
Oke Oka Jeevitham | ఓటీటీలోకి వచ్చేస్తున్న శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Varun Tej | లండన్‌లో వరుణ్‌తేజ్ కొత్త చిత్రం ప్రారంభం.. ఆసక్తికరంగా ‘VT12’ స్పెషల్ వీడియో
Adipurush | ‘ఆదిపురుష్’ యూనిట్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..!