Oke Oka Jeevitham Movie On OTT | టాలీవుడ్ హీరో శర్వానంద్ ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తుంటాడు. గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో సతమతవుతున్న శర్వాకు ‘ఒకే ఒక జీవితం’ మంచి బ్రేక్ ఇచ్చింది. శ్రీకార్తిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదలై ఘన విజయం సాధించింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌కు అమ్మ సెంటిమెంట్‌ను యాడ్ చేసి దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక అంతే అద్భుతంగా శర్వానంద్ ఈ సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పోటీగా ‘బ్రహ్మస్త్ర’ వంటి భారీ సినిమా విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధించింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ కొనుగోలు చేసింది. కాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20 నుండి డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. థియేటర్ విడుదలకు 6వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుంది. ఈ చిత్రంలో అక్కినేని అమల కీలకపాత్రలో నటించింది. శర్వాకు జోడీగా రీతువర్మ హీరోయిన్గా నటించింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి జేక్స్ బేజోయ్ సంగీతం అందించాడు.
జీవితం రెండో అవకాశం ఇస్తే విధి రాతను మార్చుకోగలమా?
శర్వానంద్, రీతు వర్మ, అమల కలయికలో వచ్చిన “ఒకే ఒక జీవితం” ఈ నెల 20 నుండి మీ సోనీ LIV లో#OkeOkaJeevithamOnSonyLIV #SonyLIV #OkeOkaJeevitham@imsharwanand @riturv @amalaakkineni1 @vennelakishore @priyadarshi_i @twittshrees pic.twitter.com/BcnFUI2Ccd— SonyLIV (@SonyLIV) October 10, 2022
Read Also:
Chennakeshava Reddy | రీ-రిలీజ్ కలెక్షన్లతో ‘జల్సా’ రికార్డు బ్రేక్ చేసిన బాలకృష్ణ.. కానీ?
Adipurush | ‘ఆదిపురుష్’ యూనిట్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..!
Varun Tej | లండన్‌లో వరుణ్‌తేజ్ కొత్త చిత్రం ప్రారంభం.. ఆసక్తికరంగా ‘VT12’ స్పెషల్ వీడియో
Ponniyin Selvan-1 | రజినీకాంత్ సినిమాను దాటి..పొన్నియన్ సెల్వన్-1 సరికొత్త రికార్డు