మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 09, 2020 , 14:40:55

బిగ్ బాస్ కోసం క‌ళ్ళు చెదిరే రెమ్యున‌రేష‌న్‌..

బిగ్ బాస్ కోసం క‌ళ్ళు చెదిరే రెమ్యున‌రేష‌న్‌..

బుల్లితెర‌పై సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్.అనేక ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతున్న ఈ షోకి రేటింగ్ బీభ‌త్సంగా వ‌స్తుంది. హిందీలో ఒక‌టి రెండు మిన‌హా మిగ‌తా షోల‌న్నింటిని  స‌ల్మాన్ ఖాన్ హోస్ట్ చేశారు. తాజా ఎపిసోడ్‌కి కూడా స‌ల్మాన్ ఖాన్ హోస్ట్ అని తెలుస్తుండ‌గా, ఒక్కొక్క హోస్టింగ్ ఎపిసోడ్‌కి రూ.16 కోట్ల చొప్పున మొత్తం రూ.500 కోట్ల‌ను స‌ల్మాన్‌ఖాన్‌ను బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ఇస్తున్నార‌ని టాక్‌. 

ఇక తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 4 త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ఈ షోకి హోస్ట్‌గా మూడో సీజ‌న్‌ని సక్సెస్ ఫుల్‌గా న‌డిపిన నాగార్జున ఉంటారని అంటున్నారు. ఆయ‌న రెమ్యున‌రేష‌న్‌కి సంబంధించి అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. మూడో సీజ‌న్ కన్నా కాస్త ఎక్కువ‌గా ఇవ్వాల‌ని  మా యాజ‌మాన్యం భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లో దీనిపై క్లారిటీ రానుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo