Singham Again | రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ సినిమాలకుండే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి సింగం ప్రాంచైజీలో వస్తున్న తాజా ప్రాజెక్ట్ సింగం అగెయిన్ (Singham Again). అజయ్ దేవ్గన్ (Ajay devgn) లీడ్ రోల్లో నటిస్తుండగా.. రన్వీర్ సింగ్, దీపికాపదుకొనే, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, కరీనాకపూర్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవలే ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. రోహిత్ శెట్టి గత చిత్రాలతో పోలిస్తే సింగం అగెయిన్ ట్రైలర్ ప్రేక్షకులను నిరాశ పరిచినట్టు ఇప్పటివరకు వస్తున్న టాక్ చెబుతోంది. ఏ పాత్రలోనైనా ఇంప్రెస్ చేసే దీపికా పదుకొనేపై ఈ సారి మాత్రం ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. దీపికా పదుకొనే పాత్ర చిరాకు తెప్పించేలా ఉందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా…. దీపికా పదుకొనే పాత్ర అందరి యాక్టర్ల కంటే చెత్తగా ఉంది. అంతేకాదు చెత్త డైలాగ్ డెలివరీ, చెత్త క్యారెక్టర్ అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.
సింగం అగెయిన్ ప్రధానంగా అజయ్ దేవ్‌గన్‌పై ఫోకస్ పెట్టడానికి బదులు.. అనవసరంగా లేడీ సింబా దీపికాపదుకొనేపై ఫోకస్ పెట్టాడు. కరీనాకపూర్ తల్లిలా కనిపిస్తుంది. సింగం క్యారెక్టర్ వృధా అయిందంటూ రాసుకొచ్చాడు. ఇక Singham Again మరో బ్లాక్ బస్టర్‌గా రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కు మరి నిరాశనే మిగులుస్తుందా.. అనేది చూడాలి. లెంగ్తీ ట్రైలర్‌ను బోరింగ్‌గా ఫీలవుతున్నారు మూవీ లవర్స్.
సింగం అగెయిన్ ట్రైలర్..
Read Also :
Naga Chaitanya | సుహాస్ జనక అయితే గనక నాగచైతన్య చేయాల్సిందట.. మరి ఏమైందంటే..?
Prabhas | క్రేజీ న్యూస్.. ప్రభాస్ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ ఆన్ ది వే..!
Salaar 2 | సలార్ 2లో కాటేరమ్మ ఫైట్‌ను మించిపోయే సీక్వెన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే..!