Shruti Haasan | విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతిహాసన్ (Shruti Haasan) తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో వరుస పరాజయాల కారణంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ ముందుకెళ్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం శ్రుతి హాసన్ ప్రభాస్ సరసన ‘సలార్’ తో పాటు మరికొన్ని భారీ చిత్రాల్లో నటిస్తోంది.
ఇక శ్రుతిహాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రొఫెషనల్, వ్యక్తిగత జీవితం గురించి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు అప్ డేట్ ఇస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా నటి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లతో సరదాగా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ శ్రుతిహాసన్ ను ఆసక్తికర ప్రశ్న వేశారు. ‘మీరు మద్యం తాగుతారా..?’ అంటూ ప్రశ్నించారు.
నెటిజన్ ప్రశ్నకు శ్రుతి హాసన్ స్పందిస్తూ.. ‘నేను మద్యం తాగను. డ్రగ్స్ కూడా తీసుకోను. నాకు ఎలాంటి చెడు అలవాట్లూ లేవు. జీవితాన్ని హుందాగా గడపటం అంటేనే నాకు ఇష్టం’ అంటూ సమాధానమిచ్చింది.
Also Read..
Cobra | ప్లాస్టిక్ డబ్బా మింగేసిన నాగుపాము.. శస్త్రచికిత్స ద్వారా తొలగించిన వైద్యులు
YouTube | డౌన్ అయిన యూట్యూబ్.. వేలాది మందికి నిలిచిన సేవలు