YouTube | ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ యూట్యూబ్ (YouTube) డౌన్ అయింది. గురువారం రాత్రి 8 గంటల వరకు వేలాది మంది యూజర్లకు యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. యూట్యూబ్, యూ ట్యూబ్ టీవీ (YouTube Tv) సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని అవుటేజ్ ట్రాకింగ్ వెబ్ సైట్ (outage tracking website) డౌన్ డిటెక్టర్ డాట్ కామ్ (Downdetector.com) వెల్లడించింది.
వేలాది మంది యూజర్లకు యూట్యూబ్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు సదరు వెబ్ సైట్ తెలిపింది. 13,000 కంటే ఎక్కువ మంది ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడినట్లు పేర్కొంది. అదేవిధంగా యూట్యూబ్ టీవీలో అంతరాయం ఏర్పడినట్లు 3,000 కంటే ఎక్కువ నివేదికలు వచ్చినట్లు సదరు వెబ్ సైట్ వెల్లడించింది.
కాగా, ఇటీవలే కాలంలో పలు వెబ్ సైట్ల సర్వర్ డౌన్ అయిన విషయం తెలిసిందే. ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో కొన్ని గంటల పాటు వాటి సేవలు నిలిచిపోయాయి. తాజాగా ఇప్పుడు యూ ట్యూబ్ సేవల్లో అంతరాయం కలిగింది.
Also Read..
Animal | ఇంతకీ.. రణ్‌బీర్‌కపూర్ యానిమల్ స్టోరీలైన్ ఏంటో తెలుసా..?
Titan submersible | పేలిపోయిన టైటాన్ సబ్మెర్సిబుల్.. ఐదుగురు పర్యాటకులు జలసమాధి
Assam Floods | అస్సాంలో 22 జిల్లాలను ముంచెత్తిన వరదలు..