Animal | అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లాంటి హిట్ చిత్రాల తర్వాత సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga) డైరెక్ట్ చేస్తున్న చిత్రం యానిమల్ (Animal). బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్(Ranbir Kapoor) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. కన్నడ సోయగం రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే మేకర్స్ యానిమల్ నుంచి విడుదల చేసిన పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించిన ఇటీవలే రష్మిక రోల్ పార్టు చిత్రీకరణ ముగిసింది.
తాజాగా ఈ సినిమా ఎలాంటి బ్యాక్ డ్రాప్లో ఉండబోతుందనేది ఓ లీక్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. నెట్టింట హల్ చల్ చేస్తున్న తాజా అప్డేట్ ప్రకారం యానిమల్ సినిమా ప్రధానంగా తండ్రీకొడుకుల రిలేషన్ షిప్ నేపథ్యంలో ఉండబోతుందట. ఈ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నాడట. పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్, రణ్ బీర్ కపూర్, అనిల్ కపూర్ మధ్య బాండింగ్ నేపథ్యంలో సిల్వర్ స్క్రీన్‌పై గతంలో ఎన్నడూ చూడని విధంగా సరికొత్త థ్రిల్ అందించేలా ఉండబోతుందని బీటౌన్ సర్కిల్ టాక్.
యానిమల్‌లో యాక్షన్, రొమాన్స్, ప్రతీకారం, డ్రామా, థ్రిల్, సంగీతం.. ఇలా ఎలిమెంట్స్ ఉండబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మిస్తున్నారు.
అర్జున్ రెడ్డి, కబీర్‌సింగ్ లాంటి సక్సెస్ఫుల్ ప్రాజెక్టుల తర్వాత సందీప్ రెడ్డి వంగా కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో యానిమల్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Animal