Titan submersible | పేలిపోయిన టైటాన్ సబ్మెర్సిబుల్.. ఐదుగురు పర్యాటకులు జలసమాధి
టైటానిక్ షిప్ (Titanic Ship) శకలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్మెర్సిబుల్ (Titan submersible) కథ విషాదాంతమైంది. తీవ్రమైన ఒత్తిడి వల్ల (Catastrophic Implosion) టైటాన్ పేలిపోయిందని, దీంతో అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు మరణించారని అమెరికన్ కోస్ట్‌గార్డ్ (US Coast Guard) ప్రకటించింది.
బోస్టన్: టైటానిక్ షిప్ (Titanic Ship) శకలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్మెర్సిబుల్ (Titan submersible) కథ విషాదాంతమైంది. తీవ్రమైన ఒత్తిడి వల్ల (Catastrophic Implosion) టైటాన్ పేలిపోయిందని, దీంతో అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు మరణించారని అమెరికన్ కోస్ట్‌గార్డ్ (US Coast Guard) ప్రకటించింది. టైటాన్‌ను వెతికేందుకు సముద్ర గర్భంలోకి పంపించిన రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్ (ఆర్వోవీ) సహాయంతో మునిగిన టైటానిక్ నౌక సమీపంలో కొన్ని శకలాలను గుర్తించినట్టు వెల్లడించింది. టైటానిక్ ఓడ సమీపంలో 488 మీటర్ల దూరంలో టైటాన్ శకలాలు ఉన్నట్లు పేర్కొంది.
అంతకుముందు టైటాన్ మినీ సబ్‌మెరైన్‌లో ప్రయాణిస్తున్న తమ సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి స్టాక్టన్ రష్, ఆయనతోపాటు వెళ్లిన షెహ్జాదా దావూద్, సులేమాన్ దావూద్, హమీష్ హర్డింగ్, పాల్ హెన్రీ నార్గెలెట్ ప్రాణాలతో లేరని ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ (OceanGate Expeditions) సంస్థ ప్రకటించింది.
అట్లాంటిక్ మహాసముద్రంలో 12 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ శకలాలను చూడటానికి టూరిస్ట్ సంస్థ ఓషియన్గేట్ పంపిన ‘టైటానిక్ సబ్ మెర్సిబుల్’ (మినీ జలాంతర్గామి) ఆదివారం రాత్రి గల్లంతైంది. దీంతో అప్రమత్తమైన అమెరికా, కెనడా రక్షణ బృందాలు.. టైటాన్ ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. దాదాపు 13 వేల అడుగుల లోతున్న చోట ఆ మినీ జలాంతర్గామి చప్పుళ్లు వినేందుకు సోనార్లను జారవిడిచారు. పీ-8 నిఘా, సీ-130 రవాణా విమానాలను కూడా రంగంలోకిదించారు. అయితే గల్లంతైన సబ్మెర్సిబుల్ తీవ్రమైన ఒత్తిడి వల్ల పేలిపోయిందని, అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు చనిపోయారని అమెరికన్ కోస్ట్‌గార్డ్ నిర్ధారించింది. కాగా, ఈ సాహసయాత్రలో పాల్గొనేందుకు ఒక్కో వ్యక్తి నుంచి దాదాపు రూ.రెండు కోట్లు వసూలు చేశారు.

Submarine
సబ్ మెరైన్ వర్సెస్ సబ్ మెర్సిబుల్
ఓషన్ ఎక్స్‌ప్లోరర్ వెబ్సైట్ ప్రకారం.. సబ్‌మెరైన్ (జలాంతర్గామి) సొంతంగానే పోర్టు నుంచి వెళ్లి తిరిగి వెనక్కి రాగలదు. కానీ, సబ్మెర్సిబుల్కి అంత శక్తి లేదు. అది పోర్టును విడిచిపెట్టాలంటే దానికి మదర్షిప్ సాయం అవసరం. సబ్మెర్సిబుల్లో పలు రకాలు ఉన్నాయి. రియల్‌టైమ్‌లో రిమోట్‌తో ఆపరేట్ చేసేవి, ముందుగానే ప్రోగ్రామ్ చేయడం ద్వారా ప్రయాణించేవి, గల్లంతైన టైటాన్‌ను పోలినవి మరికొన్ని. వీటిలో సిబ్బంది ఉండి నడిపిస్తారు. అంటే నీటిలో 10 గంటలు మాత్రమే ఉండగలదు. నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉంటాయి. గరిష్ఠంగా ఐదుగురు మాత్రమే ప్రయాణించగలరు. సబ్‌మెరైన్ ఫుట్‌బాల్ మైదానం కంటే పెద్దగా ఉంటుంది. ఆక్సిజన్‌ను అది సొంతంగా తయారుచేసుకోగలదు. కొన్ని నెలలపాటు నీటి అడుగున ఉండగలదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

