James Cameron | ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో ఇదీ ఒకటి.. టైటానిక్ మునిగిన ప్రాంతం గురించి కామెరూన్
James Cameron | అట్లాంటిక్ మహా సముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్మెర్సిబుల్ (Titan submersible) కథ విషాదాంతమైంది. ఈ క్రమంలో టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని అనేక సార్లు సందర్శించిన హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron).. ఆ ప్రదేశం గురించి గతంలో పంచుకున్న అనుభవాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.
James Cameron | అట్లాంటిక్ మహా సముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్మెర్సిబుల్ (Titan submersible) కథ విషాదాంతమైంది. తీవ్రమైన ఒత్తిడి వల్ల (Catastrophic Implosion) టైటాన్ పేలిపోయిందని, దీంతో అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు మరణించారని అమెరికన్ కోస్ట్‌గార్డ్ (US Coast Guard) ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించామని తెలిపింది. ఈ క్రమంలో టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని అనేక సార్లు సందర్శించిన హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron).. ఆ ప్రదేశం గురించి గతంలో పంచుకున్న అనుభవాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.
కామెరూన్.. ‘అవతార్’, ‘అవతార్-2’ సహా ఎన్నో భారీ చిత్రాలను తీసి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆయన తీసిన చిత్రాల్లో ‘టైటానిక్’ (Titanic) ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ఓడ సముద్రంలో ప్రమాదానికి గురై ఎలా మునిగిపోయిందో కళ్లకు కట్టినట్లు చూపించారు. సముద్రగర్భంలో 13వేల అడుగుల లోతున ఉన్న ‘టైటానిక్’ను కామెరూన్ ఇప్పటికే 33 సార్లు సందర్శించాడు. ఈ సందర్భంగా ఆ అనుభవాలను 2012లో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ‘మనుషులు ఎప్పుడూ చూడని ప్రదేశాలకు వెళ్లడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే టైటానిక్ షిప్ మునిగిన ప్రాంతానికి వెళ్లా. ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో ఇది ఒకటి’ అని చెప్పుకొచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద ఓడ ప్రమాదాల్లో టైటానిక్ ఎవరెస్ట్ వంటిది అని కామెరూన్ అన్నారు. ఓడ మునిగిపోయిన ప్రాంతాన్ని చూడాలనే ఆకాంక్షతోనే టైటానిక్ సినిమాను తీసినట్లు చెప్పారు. అంతేకానీ, ప్రత్యేకంగా దానిని ఒక సినిమాగా తీయాలనే ఉద్దేశ్యం మొదట్లో తనకు లేదన్నారు. మునిగిపోయిన టైటానిక్ ను చూడాలనే సముద్రగర్భంలో సబ్ మెరైన్ లో ప్రయాణించినట్లు చెప్పారు. దానిని బాగా చూపించాలనే ఉద్దేశ్యంతోనే పలుమార్లు టైటానిక్ మునిగిన ప్రాంతాన్ని సందర్శించినట్లు వెల్లడించారు.
మరోవైపు తప్పిపోయి అంతమైన టైటాన్ జలాంతర్గామిపై జేమ్స్ కామెరూన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏబీసీ న్యూస్ తో మాట్లాడిన ఆయన .. ఇదో భయంకరమైన, విషాదాంతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ‘కమ్యూనిటీలోని కొందరు ఈ జలాంతర్గామి గురించి చాలా ఆందోళన చెందారు. డీప్ సబ్ మెర్జెన్స్ ఇంజినీరింగ్ కమ్యూనిటీలోని కొంతమంది అగ్రశ్రేణి సభ్యులు ఓషిగేట్ కంపెనీకి లేఖలు కూడా రాశారు. వారు చేస్తున్నది చాలా ప్రయోగాత్మకం’ అని జేమ్స్ కామెరూన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read..
Titan submersible | పేలిపోయిన టైటాన్ సబ్మెర్సిబుల్.. ఐదుగురు పర్యాటకులు జలసమాధి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

