శనివారం 23 జనవరి 2021
Cinema - Oct 20, 2020 , 15:46:39

వరద బాధితులకు విరాళం.. త్రివిక్ర‌మ్,చిన‌బాబు చెరో రూ.10 లక్ష‌లు

వరద బాధితులకు విరాళం.. త్రివిక్ర‌మ్,చిన‌బాబు చెరో రూ.10 లక్ష‌లు

గ‌త కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో హైద‌రాబాద్ న‌గ‌రం చిగురుటాకులా వణికిపోతుంది. వ‌ర‌ద‌ల వ‌ల‌న ఎందరో నిరాశ్ర‌య‌లుయ్యారు. వారికి అండగా నిలిచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి  చెరో రూ.10 లక్షల విరాళం ప్రకటించారు  ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) .

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో వరద తాకిడికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా తమ వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటారు దర్శకుడు త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు). ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయక చర్యల కోసం తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి  చెరో రూ.10 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు)  ఈ మేరకు సంయుక్తంగా ఒక ప్రకటన‌ చేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, సరక్షితం గా ఉండాలని అభిలషించారు.


logo