త్వరలో సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan). లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రాబోతుంది. కాగా పొన్నియన్ సెల్వన్-1 (Ponniyin Selvan-1) సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో చెన్నైలో ఈ రెండు రోజు క్రితం ట్రైలర్, ఆడియో లాంఛ్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈవెంట్లోలీడ్ యాక్టర్లు, విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్యారాయ్, జయంరవితోపాటు స్టార్ యాక్టర్లు రజినీకాంత్, కమల్‌హాసన్ సందడి చేశారు. ప్రత్యేకించి సినిమాలో కీ రోల్స్ చేస్తున్న కార్తీ-త్రిష వస్త్రధారణ అందరినీ ఆకట్టుకుంది.
కార్తీ సంప్రదాయ లుంగీ, చొక్కాలో ఉండగా..త్రిష గోల్డెన్ జరీ వర్క్ చేయబడ్డ గులాబీ రంగు చీరలో యువరాణిలా ధగధగ మెరిసిపోయింది. మరోవైపు సిద్దార్థ్-త్రిష దగ్గరకు వచ్చి మ్యూజిక్ డ్యాన్స్ చేసి ఔరా అనిపించాడు. వీరితోపాటు విక్రమ్, ఐష్ స్టైలిష్, ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టారు.
Read Also : Hari Hara Veera Mallu | క్రిష్ సినిమాపై ఫోకస్..డేట్స్ కూడా ఇచ్చేసిన పవన్..!