Shankar | శంకర్ కోసం రాంచరణ్ వెయిటింగ్..కారణమిదే..!
ఇండియన్ 2 (Indian 2), ఆర్సీ 15 సినిమాలు ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్నాయి. అయితే చాలా కాలంగా వాయిదా పడ్డ ఇండియన్ 2 షూటింగ్ మళ్లీ రీసెంట్గా సెట్స్ పైకి వెళ్లింది.
స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ (kamal haasan) నటిస్తోన్న ఇండియన్ 2 (Indian 2), రాంచరణ్ నటిస్తోన్న ఆర్సీ 15. ఈ రెండు సినిమాలు ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్నాయి. అయితే చాలా కాలంగా వాయిదా పడ్డ ఇండియన్ 2 మళ్లీ రీసెంట్గా సెట్స్ పైకి వెళ్లింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఇండియన్ 2కు సంబంధించి మిగిలిపోయిన భాగాన్ని చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నాడు శంకర్.
చెన్నైలోని పర్రీస్ కార్నర్‌కు సమీపంలో వేసిన భారీ సెట్టులో చిత్రీకరణ కొనసాగుతుంది. రాంచరణ్ సినిమా కూడా సెట్స్ పైనే ఉందనే విషయం తెలిసిందే. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఇవాళ ఆర్సీ 15 షూటింగ్ రీస్టార్ట్ కావాల్సి ఉంది. అయితే ఇండియన్ 2 వేగంగా పూర్తి చేయాలనుకుంటున్న శంకర్ షూటింగ్ షెడ్యూల్‌ను పొడిగించాడట. ఈ నేపథ్యంలో రాంచరణ్ కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
మరోవైపు రాంచరణ్ ఇంకో సినిమా మొదలుపెట్టేందుకు చేసే ప్రయత్నాలు కూడా ఫలించడం లేదని టాక్ వినిపిస్తోంది.
రాంచరణ్ ఇతర దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నా..ఆశించిన స్థాయిలో ఇంట్రెస్టింగ్ స్టోరీలు రావడం లేదట. సెట్స్ పైకి వెళ్లాల్సిన చరణ్-గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు కూడా నిలిచిపోయింది.
ఇండియన్ 2లో కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) పీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా..బాబీ సింహా, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ తో కలిసి రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్.
Read Also : Puri Jagannadh | పూరీ జగన్నాథ్ యూటర్న్..యువ హీరోతో నెక్ట్స్ సినిమా..?
Read Also : Rajinikanth | ‘నరసింహ’కు ‘పొన్నియన్ సెల్వన్’ స్ఫూర్తి..తలైవా ఇంట్రెస్టింగ్ కామెంట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

