పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న సినిమాల్లో ఒకటి హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). ఈ టాలీవుడ్ (Tollywood) మోస్ట్ అఎయిటెడ్ ప్రాజెక్టుకు క్రిష్ (Krish) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే పొలిటికల్ ప్లాన్ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. పవన్ కల్యాణ్ వేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని ఫిక్సయినట్టు లేటెస్ట్ టాక్.
వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేందుకు పవన్ బల్క్ డేట్స్ కూడా కేటాయించాడని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. త్వరగా సినిమాను పూర్తి చేసి..వచ్చే వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇటీవలే విడుదల చేసిన మూవీ గ్లింప్స్ వీడియో అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీ రోల్స్ చేస్తుండగా..నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు హరిహరవీరమల్లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కల్యాన్ మరోవైపు సముద్రఖని డైరెక్షన్లో వినోధయ సీతమ్ రీమేక్‌లో నటించాల్సి ఉండగా..దీనికి సంబంధించిన అప్ డేట్ రావాల్సి ఉంది. సాయిధరమ్ తేజ్ కీ రోల్ చేస్తున్నాడు.
Read Also : Puri Jagannadh | పూరీ జగన్నాథ్ యూటర్న్..యువ హీరోతో నెక్ట్స్ సినిమా..?